9 రోజులు – 9 ఏరియాలు – 9 ఈవెంట్స్.. మన శంకర వరప్రసాద్ గారి ప్రమోషన్స్ మామూలుగా లేవుగా!

Wait 5 sec.

'' మూవీకి మెగా కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మరో తొమ్మిది రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగాస్టార్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటి వరకూ సాంగ్స్, పోస్టర్స్ తో సినిమాపై ఆసక్తి కలిగిస్తూ వచ్చిన రావిపూడి.. మరికొన్ని గంటల్లో మెయిన్ ప్రమోషనల్ కంటెంట్ చూపించబోతున్నారు. ఆదివారం ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. అక్కడి నుంచి నాన్ స్టాప్ గా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీన తిరుపతిలోని ఎస్వీ సినీప్లెక్స్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత 9 రోజుల పాటు 9 ఏరియాలలో 9 ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈరోజు శనివారం రాజమండ్రి రేవు దగ్గర సెలబ్రేషన్స్ చేశారు. ప్రమోషనల్ కంటెంట్ ఏదీ వదల్లేదు కానీ, మెగా అభిమానులతో కలిసి స్థానిక ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్య నాయకులు సందడి చేశారు.రేపు తిరుపతిలో ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత, జనవరి 5న నెల్లూరులో సెలబ్రేషన్స్ చేయనున్నారు. 6న విశాఖపట్నం, 7న హైదరాబాద్, 8న తాడేపల్లిగూడెం, 9న అనంతపూర్, 10న వరంగల్, 11న బెంగళూరు.. ఇలా మొత్తం మూడు రాష్ట్రాలను కవర్ చేస్తూ తొమ్మిది రోజుల్లో రకరకాల యాక్టివిటీస్ చేయబోతున్నారు. ప్రీమియర్స్ పడే రోజు వరకూ ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. అన్నింటిలోనూ అనిల్ రావిపూడి తనదైన ముద్ర వేయబోతున్నారు. వాటిల్లో కీలకమైన కొన్ని ఈవెంట్స్ లో చిరంజీవి కూడా పాల్గొనబోతున్నారు. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో గతంలో మనం చూశాం. అందులోనూ ఈసారి సంక్రాంతికి ఫుల్ కాంపిటీషన్ ఉంది. అందుకే పబ్లిసిటీ చాలా కీలకంగా మారింది. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాలో భాగమైన విక్టరీ వెంకటేష్, నయనతార కూడా ప్రచారంలో భాగం కాబోతున్నారు. స్పెషల్ ఇంటర్వ్యూలు రికార్డ్ చేస్తున్నారు. న్యూస్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు, మీడియా ఇంటరాక్షన్లు ఉండనే ఉన్నాయి. రానున్న 9 రోజుల్లో ఇవన్నీ ఒక్కటొక్కటిగా వదలబోతున్నారు. మరి అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ ఈసారి ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి.