మహిళలకు బిగ్ షాక్.. ఇప్పుడు తులం గోల్డ్ రేటు హైదరాబాద్‌లో ఎంతో తెలిస్తే..!

Wait 5 sec.

Fed Interest Rates: . వరుసగా పెరుగుకుంటూ మళ్లీ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలకు అతి చేరువలోకి వెళ్లాయి. పలు అంతర్జాతీయ అంశాలు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఇటీవల తగ్గినట్లే అనిపించినా అక్కడి నుంచి మళ్లీ వరుసగా పెరుగుతూ కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. ఇప్పుడు యూఎస్ డాలర్ సహా ఫెడ్ అంచనాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమైంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం వడ్డీ రేట్లను ప్రకటించనుంది. ఇక సీఎంఈ ఫెడ్‌వాచ్ టూల్ ప్రకారం.. సెప్టెంబర్ సమీక్షలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని 59 శాతం మంది ట్రేడర్లు అంచనా వేశారు. ఈ క్రమంలోనే డాలర్, బాండ్ ఈల్డ్స్ పతనం అవుతున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నాయి.సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే.. యూఎస్ డాలర్, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ తమ ఆకర్షణ కోల్పోయి బంగారంతో పోలిస్తే బలహీనంగా మారుతుంటాయి. ఈ క్రమంలోనే డాలర్, బాండ్ ఈల్డ్స్ ఒక వారం కనిష్టాలకు పడిపోయాయి. దీంతో బంగారం ధర ఊహించని రీతిలో ఒక నెల గరిష్టానికి ఎగబాకింది. ఇంకా డెడ్‌లైన్ (ఆగస్ట్ 1) సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆయా దేశాలతో చర్చలు సఫలం కాలేదు. ఒప్పందాలు చేసుకోలేదు. ఇలాంటి అనిశ్చితి సమయంలోనూ ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారంపై పెట్టుబడులు పెడుతుంటారు. తద్వారా రేట్లు పెరుగుతుంటాయి. మరోవైపు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను 2 శాతం వద్ద స్థిరంగా ఉంచనున్నట్లు అంచనాలు ఉన్నాయి. ఇంకా ఈయూ.. అమెరికాపైన దిగుమతి సుంకాలు విధించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. వెరసి ఇవన్నీ బంగారం ధర పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి.ఇంటర్నేషనల్ మార్కెట్ గోల్డ్ రేట్లు..అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగాయి. కిందటి సెషన్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు (31.10 గ్రాములు) 3390 డాలర్ల స్థాయిలో ఉండగా.. ఇప్పుడు అది 3430 డాలర్లపైకి చేరింది. సిల్వర్ ధర 39 డాలర్లపైకి చేరింది. ఇక డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 86.34 వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే దేశీయంగా కూడా ధరలు మారుతుంటాయి. ఈ ప్రభావం ఉదయం 10 గంటల తర్వాత కనిపిస్తుంది.హైదరాబాద్ గోల్డ్ రేట్లు..దేశీయంగా కూడా బంగారం ధర చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్‌లో ఒక్కరోజులోనే రేటు రూ. 1000కిపైగా పెరిగింది. 22 క్యారెట్లపై రూ. 1050 పెరిగి తులం రూ. 92,850 కి చేరింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ. 1140 పెరగడంతో రూ. 1,01,290 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరల బాటలోనే వెండి రేటు కూడా భారీగానే పెరిగింది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ. 2 వేలు పెరగడంతో రూ. 1.28 లక్షలకు ఎగబాకింది. గోల్డ్, సిల్వర్ ధరలు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయి.