: ఏపీ ప్రభుత్వం మరో హామీ అమలుకు సిద్ధమైంది. పథకం అమలు చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీలలో భాగంగా సౌకర్యం కల్పిస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలుచేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్ట్ 15 నుంచి పథకం ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో సోమవారం అధికారులతో చర్చించారు. అధికారులకు సూచించారు. జీరో ఫేర్ టికెట్.. ఏమేం ఉంటాయి?మరోవైపు తెలంగాణలో మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ఆధార్ కార్డు చూపించిన మహిళలకు ఆర్టీసీ సిబ్బంది జీరో టికెట్లు జారీ చేస్తున్నారు. అలాంటి పద్ధతినే ఏపీలో అనుసరించనున్నట్లు తెలిసింది. జీరో ఫేర్ టికెట్‌లో సదరు మహిళ ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేస్తున్నారు, ఉచిత బస్సు పథకంతోఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంలో బిగ్‌ అప్‌డేట్.. ఆ విధానమే అమలు..వారికి ఎంతమేర వారికి డబ్బులు ఆదా అయ్యాయనే వివరాలు, ప్రభుత్వం ఇస్తున్న 100 శాతం రాయితీ వివరాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. జీరో ఫేర్ టికెట్ జారీతో ఈ పథకం ద్వారా ఎంతమేరకు లబ్దిపొందామనే విషయం మహిళలకు తెలుస్తుందని ముఖ్యమత్రి అన్నారు. దీనికి సంబంధించి సాఫ్ట్‌వేర్ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ వంటి రాష్ట్రాలలో ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఈ పథకం అమలు ద్వారా ఎంత మేరకు ఆర్థికంగా భారం పడిందనే వివరాలను, అలాగే ఉచిత బస్సు పథకంతో ఏపీ ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం వివరాలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయాలని ఆదేశించారు.ఈ పథకం అమలుతో ఏపీఎస్ఆర్టీసీకి భారం కాకుండా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని చంద్రబాబు సూచించారు.ఆర్టీసీలో నిర్వహణా వ్యయం తగ్గించి ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని సూచించారు. ఏపీఎస్ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఏయే మార్గాలను అనుసరించాలనే దానిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అలాగే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఇకపై ఏసీ ఎలక్ర్టికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మారిస్తే నిర్వహణ వ్యయం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయని.. దానిపైనా దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో విద్యుత్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంపై అధ్యయనం చేయాలని అధికారులను సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.