భారీ వరదలోనూ దూసుకొచ్చిన థార్.. తన బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకున్న గోయెంకా.. ఏం తెలివి బాసూ..!

Wait 5 sec.

: దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. వరద నీటిలో వాహనాలు నడపడం మీరు చాలానే చూసి ఉంటారు. జీపులు, కార్లు, ట్రాక్టర్లు, జేసీబీలు పీకల లోతు వరద నీటిలోనూ వెళ్తూ ఆశ్చర్యపరుస్తుంటాయి. అలాంటి వీడియోలు వచ్చినప్పుడు ఆ వాహనం గురించి గొప్పగా చెప్తారు. అయితే దేశీయ దిగ్గజ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన మాత్రం తమ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కోసం వేరే కంపెనీ వాహనం వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంజిన్ మొత్తం మునిగేలా ఉన్న నీటిలోనూ వాహనం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా ఒడ్డుకు చేరినట్లు కనిపిస్తోంది. ఈ దృశ్యాలను పలువురు వీడియోలు తీస్తున్నట్లు కనిపిస్తోంది. అంత భారీ వరద నీటిలోనూ థార్ ఎస్‌యూవీ (Mahindra Thar SUV) దూసుకురావడంపై పలువురు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వీడియోను షేర్ చేస్తూ తమ కంపెనీ (RPG Group) బ్రాండ్ ప్రమోట్ చేసుకున్నారు హర్ష్ గోయెంకా. నిజమైన వ్యాపారవేత్త అని నిరూపించుకున్నారు. 'మహీంద్రా ఎస్‌యూవీ ఒక మంచి బలమైన టైర్‌తో (నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైందని భావిస్తున్నా) కలిసి ఉన్నప్పుడు అది అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. ఇది చూసి నమ్మండి' అంటూ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్టుకు పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. మీరు మాట్లాడేది సియెట్ (CEAT) టైర్ గురించేనా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దానికి అవుననే చెప్పాలి. ఎందుకంటే, హర్ష్ గోయెంకా ఛైర్మన్‌గా ఉన్న ఆర్‌పీజీ గ్రూప్‌లో సియెట్ బ్రాండ్‌తో టైర్లు తయారు చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా ఆయన సియెట్ టైర్లను ప్రమోట్ చేసినట్లు అర్థమవుతోంది. ఇది ఆర్‌పీజీ గ్రూప్ (RPG Group)లో ఒక భాగం. అయితే, దీనిని తొలుత 1924లో ఇటలీలో ప్రారంభించారు. టాటా గ్రూప్ భాగస్వామ్యంతో 1958లో భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారతీయ విభాగాన్ని 1982లో ఆర్‌పీజీ గ్రూప్ కొనుగోలు చేసింది. 1990లో సియెట్ లిమిటెడ్‌గా అధికారికంగా పేరు మార్చారు. ఇప్పుడు దేశీయ ప్రముఖ టైర్ బ్రాండ్లలో ఒకటిగా సియెట్ కొనసాగుతోంది. మహీంద్రా థార్‌కు సియెట్ టైర్లు వాడుతున్నారా?హర్ష్ గోయెంకా థార్ వీడియోను పోస్ట్ చేసి టైర్ల గురించి మాట్లాడిన క్రమంలో మీ మెదడులో ఓ ప్రశ్న మెదిలే ఉంటుంది. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన మహీంద్రా థార్ ఎస్‌యూవీలో సియెట్ టైర్లు వాడుతున్నారా? అని. అవునండీ అది నిజమే. 2020 తర్వాత లాంచ్ చేసిన మహీంద్రా ఎస్‌యూవీ వాహనాలకు ఆ కంపెనీ సియెట్ టైర్లను (CEAT CZAR A/T) ఒరిజినల్ కంపెనీ టైర్లుగా ఉపయోగిస్తూ మార్కెట్లోకి తీసుకొస్తోంది. ప్రస్తుతం ఈ టైర్లు 245/75 R16, 255/65 R18 సైజుల్లో లభిస్తున్నాయి. ఈ రెండు టైర్లను మహీంద్రా కంపెనీ ఒరిజినల్ టైర్లుగా ఉపయోగిస్తోంది.