తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ ముమ్మరం చేసింది. బెట్టింగ్‌ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా పేర్కొనబడిన విజయ్‌ దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్‌, మంచులక్ష్మికి నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.ఆన్‌లైన్ బెట్టింగ్‌ యాప్‌ కేసులో రానా దగ్గుబాటిని జూలై 23న, ప్రకాష్ రాజ్ ని జూలై 30న ఈడీ అధికారులు విచారించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు హాజరవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్స్ కు సంబంధించి సినీ ప్రముఖులను ఈడీ విచారించనుంది.