Hitech City Flats: మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ముఖ్యంగా మన తాజాగా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీని ప్రకారం.. హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లుగా పేరొందిన పెరిగాయి. గత ఐదేళ్లలో (2021 చివరినుంచి.. Q2 2025 మధ్య) హైటెక్ సిటీలో 70 శాతం మూలధన ధరలు పెరగ్గా.. ఇదే గచ్చిబౌలిలో చూస్తే ఏకంగా 87 శాతం పెరుగుదల నమోదైంది. ఈ ప్రాంతాల్లో ఐటీ కంపెనీల విస్తరణ, ఉద్యోగ అవకాశాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు.గచ్చిబౌలిలో ఇళ్ల ధరలు.. 2021 చివర్లో.. చదరపు అడుగుకు సగటున రూ. 6,800 - 7,200 గా ఉండగా.. ఇదే Q2 2025 నాటికి సగటున రూ. 12,700 - 13,400 కు చేరింది. ఇదే హైటెక్ సిటీలో చూసినట్లయితే 2021లో సగటున చదరపు అడుగుకు రూ. 6,200 - 6,600 గా ఉండగా.. ఇప్పుడు 2025 క్యూ2 నాటికి చ.అడుగుకు రూ. 10,500- రూ. 11,200 కు చేరింది. ఈ గణాంకాలే.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎంత వేగంగా దూసుకెళ్తుందో స్పష్టం చేస్తున్నాయి.మూలధన ధరల పెరుగుదల అంటే మీరు పెట్టుబడి పెట్టిన ఆస్తి విలువ కాలక్రమేణా ఎంత పెరిగిందనేదానిని తెలియజేస్తుంది. అంటే ఇది ఒక ఆస్తిని కొనుగోలు చేసిన ధర, దాని ప్రస్తుత మార్కెట్ విలువ మధ్య తేడానే. ఇది రియల్ ఎస్టేట్‌ను అమ్మాలనుకునే వారికి లేదా పెట్టుబడి కోసం రియల్ ఎస్టేట్‌ను కొనాలనుకునే వారికి చాలా ముఖ్యమైన కొలమానం.ఇక.. థానే, ముంబైలో గత 3 సంవత్సరాలలో సగటు గృహ ధరలు 46 శాతం పెరిగాయని అనరాక్ తెలిపింది. జూన్ 2025 నాటికి, ఈ ముంబై శివారు ప్రాంతంలో రెసిడెన్షియల్ ధరలు చదరపు అడుగుకు రూ. 19,800కి చేరుకున్నాయి, ఇది 2022 ద్వితీయార్థంలో రూ. 13,550గా ఉంది. థానే పెట్టుబడికి మరింత విలువైనదిగా నిలుస్తోంది. ఇతర ముంబై ప్రాంతాలతో పోలిస్తే ఇది చాలా సరసమైనది. ఇతర ముంబై శివారు ప్రాంతాల కంటే థానే 78% చౌకగా ఉంది. ప్రస్తుతం, థానేలో 2BHK సగటు ధర రూ. 1.25 కోట్లుగా ఉంది. ముంబైలోని సెంట్రల్ సబర్బ్స్‌లో (కుర్లా, ఘట్‌కోపర్, భాండూప్, ములుండ్, పొవాయి) ఇలాంటి ఇల్లు కొనాలంటే రూ. 2.11 కోట్లు ఖర్చవుతుంది. అదే వెస్ట్రన్ సబర్బ్స్‌లో (అంధేరి, బోరివలి, దహిసర్, గోరేగావ్, జోగేశ్వరి, జుహు, కాందివలి, ఖార్, మలాడ్, శాంతాక్రజ్, విలే పార్లే) అయితే రూ. 2.36 కోట్లు అవుతుంది.థానేలో 3 సంవత్సరాలు, 5 సంవత్సరాల కాలంలో మూలధన ధరల పెరుగుదల గణనీయంగా ఉంది. ఈ శివారు ప్రాంతంలో మూడేళ్లలో 36% మూలధన ధరల పెరుగుదల ఉంది. ఐదేళ్లలో 58 శాతానికి పెరిగింది. ఇక భారతదేశంలోని టాప్ 7 నగరాల్లో సగటు రెసిడెన్షియల్ ధరలు సంవత్సరానికి 6% నుంచి 27% వరకు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (MMR) 9 శాతం పెరుగుదల నమోదైంది. పాన్-ఇండియా స్థాయిలో, వార్షిక వృద్ధి 11 శాతంగా నమోదైంది. ఇది Q2 2024లో చదరపు అడుగుకు రూ. 8,070 గా ఉండగా.. Q2 2025లో రూ. 8,990 కు చేరింది.