హీరోగా ఏఎం రత్నం నిర్మించిన సినిమా 'హరి హర వీరమల్లు'. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రం.. జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో కంప్లీట్ అయింది. దాదాపు ఐదేళ్లుగా నిర్మాణం జరుపుకుంది. ఎట్టకేలకు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు. రిస్క్ చేసి కొన్ని ఏరియాలలో సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి టికెట్ రేట్స్ పెంచుకోడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. తెలంగాణలోనూ హైక్స్ ఉంటాయని ఆశిస్తున్నారు. ఏపీలో టికెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆల్రెడీ చర్చలు మొదలయ్యాయి. ఏఎం రత్నం మాత్రం భారీ బడ్జెట్ ఖర్చు చేసి సినిమా తీసినప్పుడు, దానికి తగ్గట్టుగా టికెట్ రేట్లు ఉండటంలో తప్పేమీ లేదని అభిప్రాయపడుతున్నారు. 'హరి హర వీరమల్లు' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఏఎం రత్నం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపుపై మీడియా మిత్రులు ప్రశ్నలు అడిగారు. దీనికి నిర్మాత స్పందిస్తూ.. కోట్ల రూపాయలతో సినిమాలు తీస్తున్నప్పుడు, రూ.100కి టికెట్ ఎలా అమ్ముతామని అన్నారు. సినిమా మేకింగ్ కి తగ్గ టికెట్ రేట్ ఫిక్స్ చేయడంలో తప్పేమీ లేదని అభిప్రాయపడ్డారు. థియేటర్లకి రండి అని ఎవరూ ఫోర్స్ చేయడం లేదని అన్నారు. హరిహర వీరమల్లు సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ హైక్స్ కోసం అప్లై చేశామని, తెలంగాణలోనూ పర్మిషన్ వస్తుందని భావిస్తున్నామని తెలిపారు. ''మన రెగ్యులర్ లైఫ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఉదాహరణకు మనం ఎక్కడికైనా ఫ్లైట్ లో వెళ్లాలంటే, టికెట్ రేట్లు ఒక్కో రోజు ఒక్కోలా ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వారంలో ఐదు రోజులు వర్క్ చేసి శని ఆది వారాల్లో ఇంటికి వెళ్లాలని ముందే ప్లాన్ చేసుకుంటారు. రూ. 2000, రూ.1500కి టికెట్ దొరుకుతుంది. అప్పుడే ఒక గేమ్ ప్లాన్ చేస్తారు. ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని టికెట్ రేట్లు పెంచేస్తారు. ఎక్కువ బుకింగ్స్ వచ్చినా, ఆ రోజు ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, వాతావరణం బాగాలేకపోయినా ధరలు పెంచేస్తారు. అప్పుడు రూ.5 వేల టికెట్ ను రూ.20 వేలకైనా కొంటాం. కానీ సినిమా టికెట్ రేట్లు రూ.100 పెంచితే మాత్రం అమ్మో ధరలు పెంచేశారు అంటారు''''హోటల్ కి వెళ్తే 100 రూపాయలు టిప్ ఇస్తారు. కానీ కోట్లు పెట్టి తీసిన సినిమా విషయానికొస్తే టికెట్ రేటు వంద పెంచారని అంటారు. చాలా మంది ఏం తెలియకుండా, 'ఇవాళ ఓటీటీ మార్కెట్ వచ్చింది. అన్ని భాషల్లో రిలీజ్ అవుతోంది. అసలు వాళ్ళకేం డబ్బులు కొరవ.. దోచేసుకుంటున్నారు' అని మీడియా ముందు కూర్చుని ఏదేదో మాట్లాడుతుంటారు. ఈరోజుల్లో వరల్డ్ సినిమాని మొబైల్ లో చూసేస్తున్నారు. మామూలు సినిమా తీస్తే జనాలు థియేటర్లకు రావడం లేదు. భారీ స్థాయిలో తీయాలంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ, గ్రాఫిక్స్, కెమెరాలు వచ్చేశాయి. ఇవన్నీ వాడి కోట్లు ఖర్చు చేసి సినిమా తీసినప్పుడు, దానికి పావలా అర్ధణా టికెట్ పెడితే ఎలా వర్కౌట్ అవుతుంది?'' ''సినిమా అనేది కంపల్సరీ కాదు. ప్రేక్షకులకు ఇష్టం ఉంటే వస్తారు. సినిమా రిలీజైన రోజే ఒకటి రెండు స్టార్స్ రేటింగ్ ఇస్తే అస్సలు థియేటర్లకు రారు. ఓటిటీలో చూసుకుందాంలే అని చాలా మంది రావట్లేదు. అవన్నీ దాటుకొని సినిమా రిలీజ్ చేసి, మొదటి మూడు రోజులు పావలా అర్ధణా టికెట్ పెట్టాలంటే ఎలా?. అప్పుడు థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. బాంబేలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ సినిమాలకు టికెట్లు రూ.1500కి అమ్ముతారు. బెంగళూరులో 500, 500 రూపాయలకు అమ్ముతారు. కానీ ఇక్కడేమో టికెట్ రేట్లు తగ్గించమని అడుగుతారు. పచ్చిగా చెప్పాలంటే, ఇదంతా వరల్డ్ వైడ్ ఎదుగుతున్న మన తెలుగు ఇండస్ట్రీని, ఇండైరెక్ట్ గా దాన్ని వెనక్కి లాగి భూస్థాపితం చేయడమే అవుతుంది. ఆడియన్స్ ఇష్టం ఉంటేనే కదా సినిమాకి వస్తున్నారు. కచ్చితంగా నా సినిమా చూడు.. థియేటర్లో కూర్చొని చూడు అని చెప్పడం లేదు కదా'' అని ఏఎం రత్నం అన్నారు.