తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక లేఖ రాయడం, దానిపై రేవంత్ రెడ్డి() చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో జరిగిన ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సోనియా గాంధీ ప్రశంసిస్తూ రాసిన లేఖ తనకు ఆస్కార్, నోబెల్ బహుమతి లాంటిదని.. ఇది తన జీవితకాల సాధన అని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి రాని వ్యక్తి అయినప్పటికీ సీఎం ఎలా అయ్యారని చాలా మంది అడుగుతున్నారని.. అయితే రాహుల్ గాంధీ ఆత్మతో తన ఆత్మ కలిసిందని.. ఆయన ఆలోచనలను ఆచరణలో పెట్టాలని తాను నిర్ణయించుకున్నానని చెప్పారు. అనుకున్నవన్నీ అమలు చేశాను కాబట్టే నేడు తెలంగాణ మోడల్ గురించి దేశమంతా మాట్లాడుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ మాట తనకు బంగారు గీత అని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. తెలంగాణ సామాజిక సర్వే.. ఒక 'రేర్ మోడల్'..తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల గణన (SEEEPC) ధీ ప్రశంసించారు. ఇందిరా భవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర రాష్ట్ర నాయకులతో కలిసి ఈ సర్వే వివరాలను రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పార్టీ ఎంపీలకు సమర్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇంత సమగ్రమైన కులగణన ఎవరూ చేపట్టలేదని, అందువల్ల దీనిని తెలంగాణ మోడల్‌గా కాకుండా, ఒక 'రేర్ మోడల్'గా అభివర్ణించవచ్చని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కులగణన నిర్వహణ సులభమైన పని కాదని, రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం, ప్రభుత్వం అంచనాలకు మించి విజయం సాధించిందని ప్రశంసించారు. సరైన డేటా ఆధారంగా మాత్రమే సామాజిక న్యాయం, సాధికారత కోసం విధానాలు రూపొందించవచ్చని, తెలంగాణ ఈ కీలకమైన సమాచారాన్ని సేకరించిందని అన్నారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా బీసీలకు విద్య, కల్పించే రెండు బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. వీటిని భారత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్‌గా మార్చబడిన ఓబీసీ అని, అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వ్యాఖ్యానించారు. సర్వే వివరాలు, ఫలితాలు..లో 94,863 మంది ఎన్యూమరేటర్లు, 9,628 మంది సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. వీరు 94,261 ఎన్యూమరేషన్ బ్లాక్‌లలో 56 ప్రశ్నలతో ఇంటింటికీ వెళ్లి 3.55 కోట్ల మంది జనాభా (96.9%) సమాచారాన్ని సేకరించారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు కేవలం 36 రోజుల్లో ఈ భారీ డేటాను డిజిటలైజ్ చేశారు. ఈ సర్వే ఫలితాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56.4% (బీసీ ముస్లింలు 10.08%), ఎస్సీలు 17.45%, ఎస్టీలు 10.08%, ఉన్నత కులాలు 10.09%, 3.09% మంది తమకు కులం లేదని పేర్కొన్నారు. ఈ డేటా ఆధారంగా తెలంగాణ 'ఎక్స్ రే' తేలిందని, ఎవరెంతో వారికంత దక్కాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. విద్య, ఉద్యోగం, రాజకీయాల్లో ఎవరి వాటాలు వారికి లభించాలని, ఇందుకు దేశమంతా డేటా బేస్డ్ సర్వే జరగాలని అభిప్రాయపడ్డారు. ఏ వర్గానికి అన్యాయం జరగకూడదన్నదే కాంగ్రెస్ పార్టీ విధానమని ఖర్గే స్పష్టం చేశారు. తెలంగాణ సామాజిక న్యాయం దిశగా సాగుతోందని పేర్కొన్నారు. బీసీలలో ముస్లింలను చేర్చితే రిజర్వేషన్లు 60% దాటుతాయని తెలిపారు. అలాగే, ఆంగ్ల విద్య దేశానికి చాలా అవసరమని, దీనితో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు.