ఏపీలో రెండు విమానాలు సాంకేతిక లోపంతో ఆగిపోయాయి. ఆ రెండు విమానాలు కూడా రేణిగుంట ఎయిర్‌పోర్ట్ నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సినవి కావడం కలకలం రేపింది. ఆదివారం ఉదయం స్పైస్‌ జెట్‌ విమానం హైదరాబాద్‌ నుంచి రేణిగుంటకు చేరుకుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో హైదరాబాద్ వెళ్లాల్సి ఉంది. కానీ రేణిగుంటకు చేరుకున్న వెంటనే మొరాయించింది. దీంతో విమానాన్ని పైలట్లు ఇక్కడే నిలిపివేయగా ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.. వారు గంటల తరబడి అక్కడే వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం రాత్రి కూడా మరో ఘటన జరిగింది. రేణిగుంట విమానాశ్రయంలో ఇండిగో విమానం హైదరాబాద్ నుంచి రాత్రి ఏడు గంటలకు ఇండిగో విమానం రేణిగుంటకు చేరుకుంది. ఆదివారం రాత్రి 7:50 నిమిషాలకు 200 మంది ప్రయాణికులతో హైదరాబాద్ బయల్దేరింది. అయితే విమానం గాల్లో ఉండగా విమానంలో సాంకేతిక లోపం వల్ల ఏసీ పనిచేయలేకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే పైలట్ వెంటనే అలర్ట్ అయ్యారు.. విమానాన్ని అరగంటసేపు గాలిలో తిప్పి, సురక్షితంగా రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విమనానికి మరమ్మతులు చేసినా ఫలితం లేకపోవడంతో సర్వీసును రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించకుండా రీఫండ్ చేస్తామని చెప్పి అక్కడి నుంచి పంపించారు. రేణిగుంట నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత పలు ఘటనలు కలకలం రేపాయి. కొన్ని విమానాశ్రయాల్లో విమానాలు సాంకేతిక లోపంతో ల్యాండ్ అయిన ఘటనలు జరిగాయి. దీంతో ప్రయాణికులకు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో తిరుపతి నుంచి బయల్దేరిన విమానం గాల్లో చక్కర్లు కొట్టడంతో ప్రయాణికులు కంగారుపడ్డారు.. విమానం సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం కూడా మరో విమానం సాంకేతిక కారణాలతో ఆగిపోవడం చర్చనీయాంశమైంది.. ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.జూన్ 12ననుంచి ఎయిర్ ఇండియా విమానం లండన్ బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే అది సమీపంలోని హాస్టల్‌పై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలోని 241 మంది ప్రయాణికుల్లో ఒకరు తప్ప అందరూ చనిపోయారు.హాస్టల్‌లోని కొంతమంది వైద్య విద్యార్థులు కూడా చనిపోయారు. మొత్తం మీద ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో 271 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా రూ.కోటి పరిహారం చెల్లించింది. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అహ్మదాబాద్‌‌లో జరిగిన ఈ విమానం ప్రమాదంపై ప్రస్తుతం దర్యాప్తు కూడా కొనసాగుతోంది.