UIDAI కొత్త ప్రాజెక్ట్.. ఇక స్కూళ్లలోనే ఫ్రీగా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు.. కోట్లాది పిల్లల కోసం!

Wait 5 sec.

: భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేది కేవలం ఒక గుర్తింపు పత్రమే కాదు. భారత పౌరుడికి అత్యంత కీలకమైన, అన్ని అధికారిక అవసరాలకు ప్రామాణికమైన పునాది. , దేశంలోని ప్రతి పౌరుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందిస్తుంది. ప్రభుత్వ సేవలు, ఆర్థిక లావాదేవీలు, అనేక ఇతర ప్రయోజనాలను పొందడంలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా.. పాన్ కార్డు కోసం అప్లై చేయాలన్నా.. ఇతర గుర్తింపు అవసరాల కోసం కూడా ఆధార్ కార్డు కీలకంగా ఉంటుంది. అయితే.. ఆధార్ కార్డులో మన పేరు, లింగం, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ సహా.. కనుపాప స్కాన్, వేలి ముద్రలు వంటి బయోమెట్రిక్ సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. అందుకే ఇందులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి. అయితే చిన్న పిల్లలకు మాత్రం ఐదేళ్లు దాటిన తర్వాతే బయోమెట్రిక్ అప్డేషన్ ఉంటుంది. అంటే ముందుగా . కానీ చాలా మంది దీనిని మర్చిపోతున్నారు. అప్డేట్ చేసుకోవట్లేదు. ఈ క్రమంలోనే యూఐడీఏఐ కొత్త ప్రాజెక్ట్ లాంఛ్ చేసింది. దేశవ్యాప్తంగా ఐదేళ్లు దాటినప్పటికీ.. ఆధార్ అప్‌డేషన్ చేయించుకోని చిన్నారులు 7 కోట్ల మందికి పైగా ఉన్నట్లు గుర్తించింది. ఈ క్రమంలోనే.. చిన్నారుల బయోమెట్రిక్ ప్రక్రియను సులభతరం చేసేందుకు కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దీంట్లో భాగంగా.. ఇప్పుడు పాఠశాలల్లోనే దశలవారీగా ఈ ప్రక్రియను అమలు చేయనున్నారు. సీఈఓ భువనేశ్ కుమార్ మాట్లాడుతూ, "పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌ను తల్లిదండ్రుల అంగీకారంతో.. స్కూళ్ల ద్వారా చేపట్టేందుకు మేం ప్రాజెక్టును రూపొందిస్తున్నాం. ప్రస్తుతానికి దీనికి కావాల్సిన సాంకేతికతను పరీక్షిస్తున్నాం. మరో 45 నుంచి 60 రోజుల్లో ఇది సిద్ధమవుతుంది." అని తెలిపారు. ప్రతి జిల్లాకు బయోమెట్రిక్ యంత్రాలను పంపించి, ప్రతి పాఠశాలలో ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు."అనేక ప్రభుత్వ పథకాల అమలులో ఆధార్ కీలకం. ప్రతి చిన్నారికీ అవసరమైన ప్రయోజనాలు సమయానికి అందాలంటే ఆధార్ తప్పనిసరి. అందుకే పాఠశాలల ద్వారా ఈ ప్రక్రియను సులభతరం చేయాలనుకుంటున్నాం" అని భువనేశ్ కుమార్ చెప్పారు.ముఖ్యంగా 15 ఏళ్లు పూర్తయిన పిల్లలకు (పదేళ్లకు ఓసారి) రెండో తప్పనిసరి (MBU) కోసం కూడా ఇదే విధానాన్ని స్కూళ్లు, కాలేజీల ద్వారా అమలు చేయాలని యూఐడీఏఐ చూస్తోంది. స్కూల్ అడ్మిషన్, నగదు బదిలీ పథకాలు, స్కాలర్‌షిప్‌లు వంటి ప్రభుత్వ ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ వివరాలు ఎప్పుడూ అప్‌డేట్‌గా ఉండడం అత్యవసరం.అప్డేట్ సమయానికి పూర్తిచేయకపోతే ఆధార్ డేటాలో తప్పిదాలు రావచ్చు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, 7 ఏళ్ల వయసు తర్వాత కూడా బయోమెట్రిక్ పూర్తి చేయకపోతే ఆధార్ డీయాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక 5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు అప్‌డేషన్‌కు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఏడేళ్లు దాటితే మాత్రం రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.