అలా అయితేనే MLA పదవికి రాజీనామా.. రాజాసింగ్ యూటర్న్ తీసుకున్నట్లేనా..?

Wait 5 sec.

గోషామహల్ (బీజేపీ) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచందర్ రావును నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పదవికి తాను కూడా ఆశించినప్పటికీ.. అడ్డుకుందని ఆయన ఆరోపించారు. పార్టీ నిర్ణయాలు లక్షలాది మంది కార్యకర్తల ఆశలను, కష్టాన్ని దెబ్బతీస్తున్నాయని, కొందరు స్వార్థ ప్రయోజనాలతో కేంద్ర నాయకత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. దీంతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్ రాజీనామాను తెలిపారు. రాజీనామా లేఖలో రాజాసింగ్ పేర్కొన్న అంశాలు పార్టీ సిద్ధాంతాలకు, పనితీరుకు సరిపోలవని బీజేపీ స్పష్టం చేసింది. క్రమశిక్షణారాహిత్యం కారణంగానే రాజీనామాను ఆమోదించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసినప్పటికీ, ఎమ్మెల్యే పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. ముందు పదవికి కూడా రాజీనామా చేస్తానని రాజాసింగ్ ప్రకటించినా.. ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం లాల్ దర్వాజ బోనాల ఉత్సవాల్లో రాజాసింగ్ పాల్గొన్నారు. సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ ఆయన రాజీనామా ఆమోదించిన నేపథ్యంలో తాను కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి ఇతర పార్టీలలోకి వెళ్తానని జరుగుతున్న ప్రచారాన్ని రాజాసింగ్ ఖండించారు. తాను పక్కా హిందూ నేతను అని, ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. భారతదేశానికి సేవ చేస్తున్న నరేంద్ర మోదీ, అమిత్ షాలకు ప్రచారకుడిగా పనిచేస్తానని ఆయన ప్రకటించారు.బీజేపీ కమలం గుర్తుపై గెలిచిన తాను.. అధిష్టానం ఆదేశిస్తేనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, గోషామహల్‌లో బైపోల్ వస్తే పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందో తెలియదన్నారు. బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని, తన చివరి శ్వాస వరకు హిందుత్వం కోసం పోరాటం చేస్తానని అన్నారు. బీజేపీ అధిష్టానంపై తనకు ఎలాంటి వ్యతిరేక భావం లేదని కూడా రాజాసింగ్ స్పష్టం చేశారు. తాజాగా చేసిన ఈ కామెంట్స్ చూస్తుంటే.. ఆయన తిరిగి బీజేపీలోకి వచ్చే ఆలోచనతో ఉన్నట్లు అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.