'నా భర్త సంసారానికి పనికిరాడు విడాకులివ్వండి'... కోర్టుకెక్కిన మహిళ, న్యాయస్థానం సంచలన తీర్పు

Wait 5 sec.

తన భర్త సంసారానికి పనికిరాడని తనకు మంజూరు చేయాలని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ 38 ఏళ్ల మహిళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. తన భర్తకు నపుంసకత్వం ఉందని.. లైంగికంగా బలహీనుడని ఇక అతడితో ఉండలేనని పిటిషన్ దాఖలు చేసింది. వివాహానికి ముందు తనకున్న సమస్యను దాచిపెట్టి పెళ్లి చేసుకున్నాడని.. ప్రభుత్వ ఉద్యోగి అయిన అతడి నుంచి కూడా ఇప్పించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. 33 ఏళ్ల భర్తకు నపుంసకత్వం ఉందని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ విడాకులు మంజూరు చేయడానికి నిరాకరించింది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన ఓ మహిళకు 2013లో ప్రభుత్వ ఉద్యోగి అయిన వ్యక్తితో వివాహం జరిగింది. కొన్నాళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఆమె విడాకులు హైదరాబాద్‌ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ కోర్టు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. ఫ్యామిలీ కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. ఆమె హైకోర్టును ఆశ్రయించింది. తనకు పెళ్లి జరిగిన తర్వాత, హనీమూన్ ట్రిప్స్‌, ఇద్దరూ కలిసి కొన్ని సంవత్సరాలు యూఎస్‌లో ఉన్నప్పుడు లైంగికంగా కలవలేదని ఆరోపించింది. తన భర్తకు నపుంసకత్వం ఉందని, అతడు లైంగిక జీవితానికి పనికిరాడని పిటిషన్‌లో పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955 ప్రకారం అయితే భార్య వాదనను భర్త విబేధించాడు. భర్త తన మెడికల్ రిపోర్టులను, లైంగికంగా తాను సమర్థుడిని అని రుజువు చేసే సాక్ష్యాలను కోర్టుకు సమర్పించారు. వివాహానికి ముందు, ఆ తర్వాత కూడా తామిద్దరం పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధాన్ని కొనసాగించామని ఆయన పేర్కొన్నారు. 2021లో నిర్వహించిన ప్రభుత్వ ఆసుపత్రి పొటెన్సీ పరీక్ష నివేదికను కూడా కోర్టుకు సమర్పించారు, అందులో తనకు లైంగిక సంబంధానికి ఎటువంటి 'అసమర్థత' లేదని స్పష్టంగా ఉందని వాదించాడు. ఇరు పక్షాల వాదనలు విన్న జస్టిస్ మౌష్మి భట్టాచార్య, జస్టిస్ బి.ఆర్. మధుసూదన్ రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఆమె కేసును కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. భర్త లైంగిక సామర్థ్యం నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. 2013లో వివాహం జరిగినప్పటి నుండి 2018లో కుటుంబ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసే వరకు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావని పిటిషన్‌రు హైకోర్టు ప్రశ్నించింది. 2013 నుంచి 2018 వరకు భర్తతో కలిసి నివసించడం, అలాగే ఆమె వాదనలకు మద్దతుగా ఎటువంటి వైద్య లేదా నిపుణుల సాక్ష్యాలు లేకపోవడం వంటి వాటిని కోర్టు ఎత్తి చూపింది. వైద్య లేదా వాస్తవ ఆధారాలు లేకుండా కేవలం ఆరోపణలు మాత్రమే వివాహాన్ని చెల్లనిదిగా ప్రకటించడానికి సరిపోవని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన భర్తకు వ్యతిరేకంగా యుఎస్‌లో పెండింగ్‌లో ఉన్న ఆర్థిక వివాదాలకు సంబంధించిన అదనపు పత్రాలను కేసులో చేర్చాలన్న ఆమె అభ్యర్థనను కూడా కోర్టు తిరస్కరించింది, అవి ఈ కేసుతో సంబంధం లేనివిగా పేర్కొంది. కాగా, ఈ తీర్పు వైవాహిక వివాదాలలో ఆధారాల ప్రాముఖ్యతను మరోసారి స్పష్టం చేసింది.