తెలంగాణకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. ఆ 36% మెడికల్‌ సీట్లు ఏపీకే, విద్యార్థులకు సూపర్ న్యూస్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన మెడికల్ సీట్ల విషయంలోకీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో పెరిగాయి.. ఏకంగా 36శాతం సీట్లు రాష్ట్రంలో విద్యార్థులకు దక్కనున్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి కేటాయించిన 36 శాతం మెడికల్ సీట్లు ఇకపై ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే కేటాయిస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న గడువు ముగియడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విభజన చట్టంలో పేర్కొన్న గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. గతంలో ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల విద్యార్థులతో ఈ సీట్లు భర్తీ చేసేవారు. గత ఏడాది (2024-25) వరకు ప్రవేశాలు పొందగా.. 2025-26 ప్రవేశాల్లో వారికి అవకాశం ఉండదు. 'విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలోని 85 శాతం సీట్లను రాష్ట్రంలోని ఏయూ, ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులతోనే భర్తీ చేస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను అన్‌ రిజర్వుడు కేటగిరిలో పొరుగు రాష్ట్రాల విద్యార్థులు పొందవచ్చు. అయితే కొన్ని షరతులు వర్తిస్తాయి. 85 శాతం సీట్లను రాష్ట్రంలోని ఏయూ, ఎస్వీయూ పరిధిలోని విద్యార్థులతోనే భర్తీ చేస్తారు' అని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో సీట్లపై టెన్షన్ తొలగిపోయింది. ఒక్కో కాలేజీకి 150 సీట్లను నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) వెబ్‌సైట్‌లో చూపించింది. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలు జరగనున్నాయి. అయితే ప్రొఫెసర్లు, సౌకర్యాలు సరిగా లేవని NMC గతంలో అభ్యంతరం తెలిపింది. దీనిపై అధికారులు ఢిల్లీకి వెళ్లి పరిస్థితులు చక్కదిద్దుతామని హామీ ఇచ్చారు. అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. దీనికి NMC సంతృప్తి చెందింది. కాలేజీల్లోని సీట్లను యథాతథంగా ఉంచుతూ వెబ్‌సైట్‌లో పెట్టింది. సీట్లను యథాతథంగా ఉంచుతున్నామని ఎన్ఎంసీ తెలిపింది.రాష్ట్రంలోని మూడు ప్రైవేట్ వైద్య కళాశాలల్లో తగినంతమంది అధ్యాపకులు లేరని, వసతులు సరిగా లేవని ఎన్‌ఎంసీ గుర్తించింది. దీనితో ఆ కళాశాలలకు జరిమానా విధించింది. తిరుపతిలోని శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీకి రూ.20 లక్షలు, విజయవాడలోని నిమ్రా ఇన్‌స్టిట్యూట్‌కు రూ.15 లక్షలు, కడపలోని ఫాతిమా ఇన్‌స్టిట్యూట్‌కు రూ.10 లక్షలు జరిమానా వేశారు. రెండు నెలల్లో లోపాలు సరిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రం ఈ కాలేజీల్లో ప్రవేశాలకు అనుమతి ఇచ్చారు.