పెళ్లి గురించి ఆవిడే చెప్పాలి.. నెలకి మూడు రోజులే అంట.. తేజస్వినిపై యాంకర్ స్రవంతి కామెంట్స్

Wait 5 sec.

సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్స్ లేటెస్ట్ ఎపిసోడ్‌ ప్రోమో వచ్చింది. ఈసారి 'బ్యాచిలర్స్ Vs మ్యారీడ్' థీమ్‌తో ఎపిసోడ్‌ చేశారు. దీంతో పెళ్లి అయిన సీరియల్ సెలబ్రెటీలు అంతా ఒకవైపు పెళ్లి కాని బ్యాచిలర్స్ ముత్యాలన్నీ మరో వైపు నిల్చొని తెగ తిట్టుకున్నారు. మ్యారీడ్ టీమ్‌లో కౌశిక్, కెవ్వు కార్తిక్, తేజస్విని గౌడ, కీర్తి, యాంకర్ స్రవంతి ఉన్నారు. బ్యాచిలర్స్ టీమ్‌లో నూకరాజు, అభినయశ్రీ, శ్రీకర్ కృష్ణ, రీతూ చౌదరి, అషూరెడ్డి సందడి చేశారు.ముందుగా పెళ్లి దాని ప్రాముఖ్యత ఏంటో చెప్పాలని కౌశిక్‌కి అడిగాడు సుధీర్. దీనికి పెళ్లి అద్భుతం, అపురూపం, అమోఘం అంటూ డైలాగ్ కొట్టాడు. దీనికి ఇన్ని అబద్ధాలు ఆడాలంటే కష్టం కదన్నా అంటూ పంచ్ వేశాడు కార్తిక్. తర్వాత అభినయశ్రీ దగ్గరికెళ్లి మీరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని సుధీర్ అడిగాడు. ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నాను.. పెళ్లి అంటే అసలు ఇంట్రెస్ట్ లేదని అభినయ చెప్పింది. తేజు-అమర్‌ లైఫ్‌పైఇక తర్వాత తేజస్విని గారు మీరు చెప్పండి అసలు పెళ్లి గురించి అని సుధీర్ అడిగాడు. తేజు ఏదో చెప్పబోతే ఆవిడ బాగా చెబుతారంటూ పంచ్ వేశాడు కౌశిక్. వెంటనే స్రవంతి కూడా తగులుకుంది. అవును చాలా బాగా చెప్తుంది.. నెలకి మూడు రోజులట అని స్రవంతి కామెంట్ చేసింది. ఇది వినగానే తేజు సహా అందరూ నవ్వుకున్నారు. అయితే చాలా మంది ఆడియన్స్‌ స్రవంతి ఎందుకు అలా చెప్పిందబ్బా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.నిజానికి అమర్-తేజు ఇద్దరూ బిజీ ఆర్టిస్టులు అన్న విషయం తెలిసిందే. అమర్ అయితే ప్రస్తుతం పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక మధ్యలో ఎప్పుడైనా ఖాళీ దొరికితే టీవీ షోలకి గెస్టుగా వెళ్తుంటాడు. మరోవైపు తేజు కూడా టీవీ షోలు, యూట్యూబ్ ఛానల్ చూసుకుంటూ బిజీగా ఉంది. దీంతో ఇద్దరూ ఖాళీగా ఉండి.. ఒకరితో ఒకరు గడపాలంటే నెలకి ఒక మూడు రోజులు దొరుకుతాయనే ఉద్దేశంతో స్రవంతి ఇలా చెప్పి ఉండొచ్చు. �� మరోవైపు బుల్లితెర క్యూట్ కపుల్స్‌లో అమర్-తేజు ఎప్పుడూ ముందుంటారు. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీటిని ఇద్దరూ ఖండించారు. ఏవో చిన్న గొడవలు ఉన్నంతమాత్రాన ఇలా విడాకులు తీసుకోబోతున్నామని చెప్పడం కరెక్ట్ కాదని తాము ఎప్పుడూ కలిసే ఉంటామని అటు తేజు ఇటు అమర్ చాలా సార్లు చెప్పారు.