భారత్ అభివృద్ధిపైపు పరిగెడుతుంటే.. పాక్ అప్పులు అడుక్కుంటోంది..: ఐరాసలో పర్వతనేని హరీష్

Wait 5 sec.

Harish Parvathaneni in Slams Pak on UN: అంతర్జాతీయ వ్యాప్తంగా శాంతి, భద్రతలను ప్రోత్సహించడంపై చర్చించేందుకు పాకిస్థాన్ అధ్యక్షతన జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశంలో దాయాది దేశం భారత్‌పై తీవ్ర విమర్శలు చేసింది. ఈక్రమంలోనే ఇండియా కూడా గట్టిగా బదులిచ్చింది. మరోసారి పాక్ నోరు మెదపకుండా చేసింది. ముఖ్యంగా సరిహద్దు ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని భారత్ పరోక్షంగా పాకిస్థాన్‌ను హెచ్చరించింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. భారత్ అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంటే.. పాకిస్థాన్‌ మాత్రం మతోన్మాదం, ఉగ్రవాదంలో పూర్తిగా కూరుకుపోయిందని చెప్పారు. అలాగే ఆ దేశం అప్పులు తీసుకోవడంలోనే చాలా బిజీగా ఉందని పరువు తీసేలా మాట్లాడారు. ఈ సమావేశానికి పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అధ్యక్షత వహించగా.. ఆయన జమ్మూ కాశ్మీర్, సింధు నదీ జలాల ఒప్పందం వంటి అంశాలను లేవనెత్తడానికి ప్రయత్నించారు. దీనికి . ఒకవైపు భారత్ ప్రజాస్వామ్య, ఆర్థిక పురోగతిని సాధిస్తుంటే... మరోవైపు , ఉగ్రవాద సమస్యలతో సతమతమవుతోందని హరీష్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న ఒక ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించిందని, ఆ తర్వాత భారత్ "ఆపరేషన్ సింధూర్" ద్వారా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకారం తీర్చుకుందని హరీష్ వివరించారు.సమకాలీన ప్రపంచంలో సంఘర్షణల స్వభావం మారుతోందని, వాటిని పరిష్కరించడంలో జాతీయ యాజమాన్యం ఎంత కీలకమో హరీష్ నొక్కి చెప్పారు. ఉగ్రవాదం అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని, అది పునరుద్ఘాటించారు. దేశాలు తమ సరిహద్దుల నుండి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించకుండా, నిరోధించడానికి కట్టుబడి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఐరాస భద్రతా మండలిలో అత్యవసరంగా సంస్కరణలు తీసుకు రావాల్సిన ఆవశ్యకతను కూడా హరీష్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ప్రస్తుత భద్రతా మండలి ప్రపంచంలోని వాస్తవాలను ప్రతిబింబించడం లేదని, మరింత విస్తృతమైన, ప్రాతినిధ్యం వహించే సంస్థగా అది మారాలని సూచించారు.మరోవైపు భారత్-పాక్ ఉద్రిక్తతల అంశాన్ని అమెరికా ప్రస్తావించింది. ఆ రెండు దేశాల మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఐరాసలో వాషింగ్టన్ రాయబారి వ్యాఖ్యానించారు. దీనిపై కూడా పర్వతనేని హరీష్ స్పందించారు. పాకిస్థాన్ పీఓకేలోని ఉగ్ర శిబిరాలను ల్యంగా చేసుకునే భారత్ ఆపరేషని సిందూర్ చేపట్టిందని గుర్తు చేశారు. తమ ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్న తర్వాత ఒప్పందాన్ని అంగీకరించామన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే అమెరికాకు చెప్పామని.. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదని మరోసారి తేల్చి చెప్పారు.