: అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే అందుబాటులో ఉన్న బస్సులు, మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తే ఇంకా ఎన్ని బస్సులు అదనంగా అవసరమవుతాయనే దానిపై రవాణా శాఖ అధికారులు కసరత్తు జరుపుతున్నారు. ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం.. రహదారుల భద్రతపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సులలో పథకం అమలు చేసేందుకు 1400 బస్సులను సిద్ధం చేసినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వివరించారు. అలాగే 2000 ఎలక్ట్రిక్‌ బస్సుల కొనుగోలుకు ప్రయత్నాలు ప్రారంభించామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మరో మూడు రోజుల్లో విధివిధానాలు విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు.మరోవైపు జారీ చేయనున్నారు. అధికారులను ఆదేశించారు. మహిళలు ప్రయాణించే సమయంలో వారికి జీరో ఫేర్ టికెట్ ఇవ్వాలని.. ఆ టికెట్ మీద ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ప్రయాణం చేస్తున్నారు.. ప్రభుత్వం కల్పించిన ఉచిత బస్సు పథకంతో వారికి ఎంతమేరకు డబ్బులు ఆదా అవుతున్నాయనే వివరాలను పొందుపరచనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్ సిద్ధం చేసే పనిలో రవాణాశాఖ అధికారులు ఉన్నారు. మరోవైపు పథకం అమల్లోకి వస్తే ఏపీఎస్ఆర్టీసీపై భారం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర మార్గాలలో ఆదాయాన్ని పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. నిర్వహణ వ్యయం తగ్గించుకోవటంతో పాటుగా ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇకపై ఎలక్ట్రికల్ బస్సులు మాత్రమే కొనుగోలు చేయాలని.. అలాగే డీజిల్ బస్సులను ఎలక్ట్రికల్ బస్సులుగా మార్చే ఆలోచన చేయాలని చంద్రబాబు రవాణా శాఖ అధికారులకు ఇటీవల సూచించారు. ఇలా మారిస్తే నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉందని.. ఆ దిశగా ఆలోచన చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే విషయంపై కసరత్తు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మొత్తంగా ఆగస్ట్ 15 నుంచి అయితే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి రానుంది.