ఏం కావాలంటే అది చేస్కోండి.. 'వీరమల్లు' బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై పవన్ రియాక్షన్

Wait 5 sec.

'హరిహర వీరమల్లు' సినిమా జులై 24న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ టీమ్ ప్రమోషన్స్‌ గట్టిగానే చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి ప్రెస్ మీట్ పెట్టడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ పెరిగింది. అలానే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా ఘనంగా జరిగింది. అయితే ఉదయం నుంచి ట్రెండ్ అవుతోంది. దీనికి పవన్ ఫ్యాన్స్ గట్టిగానే రిప్లయ్‌లు ఇస్తున్నారు. కానీ వైసీపీ ఫ్యాన్స్, జగన్ అభిమానులు, యాంటీ ఫ్యాన్స్ రంగంలోకి దిగడంతో బాయ్‌కాట్ హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది.ఏం కావాలన్నా చేసుకోమనండిఇక తాజాగా దీనిపై పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ బాయ్‌కాట్ విషయాన్ని అడగ్గా సూటిగా బదులిచ్చారు పవన్. "బాయ్‌కాట్ చేయాలా దేనికంట.. అంటే బాయ్‌కాట్ దేనికి చేయాలని.. అయినా ఈ బాయ్‌కాట్‌లు అనేవి నడవవులెండి అది వేరే విషయం.. ఎందుకంటే సినిమాకి బాయ్‌కాట్ నడవదు.. సినిమాని గన్ పాయింట్‌లో పెట్టి ఎవరూ చూపించరు... ఇష్టపడి టికెట్ కొనుక్కొని వెళ్తారు.. నేను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోవాలి అనేది నా ఛాయిస్.. నేను చిన్నప్పుడు ఏదైనా సినిమాలకి వెళ్లాలంటే రామారావు గారి సినిమాలకి లేదా వేరే ఎవరి సినిమాకైనా టికెట్లు దొరక్కపోతే మా కజిన్స్ బ్లాక్‌లో టికెట్ కొని ఇస్తే మేము వెళ్లాం.. ఇది ఏంటంటే మన ఛాయిస్.. అలాంటిదాన్ని బాయ్‌కాట్ చేయమని ఎవరైనా చెప్పినా చేయరు.. నచ్చకపోతే చూడకపోవడం వేరు కానీ ఇలాంటివి నడవవు. అయినా మేము పనులు చేసేటప్పుడు ప్రత్యర్థులు లేకుండా ఎందుకు ఉంటారు.. ఇలాంటి పనులు చేయకుండా ఎందుకు ఉంటారు.. అలాంటివి చేయకూడదని అనుకోవడం మన అవివేకం.. కనుక వాళ్లకి ఏం కావాలంటే అది చేసుకోనివ్వండి.. వాళ్లు ఏం చేసుకుంటారో చేసుకోమనండి సంతోషం.." అంటూ పవన్ సవాల్ చేశారు.�� ప్రస్తుతం ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోతో బాయ్‌కాట్ ట్రెండ్‌కి బదులిస్తున్నారు. పవర్‌లో లేనప్పుడే 'మనల్ని ఎవడ్రా ఆపేది' అంటూ ధైర్యంగా దిగిన వ్యక్తిని.. ఇప్పుడు పవర్‌లో ఉండగా బెదిరించాలని అనుకోవడం వాళ్ల అమాయకత్వం అంటూ ఫ్యాన్స్ ట్వీట్లు వేస్తున్నారు. క్రిష్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్ట్‌ని జ్యోతికృష్ణ పూర్తి చేశారు. పవన్ రాజకీయాలు, కరోనా సంక్షోభం రావడంతో 2020లో మొదలైన ఈ ప్రాజెక్టు ఎట్టకేలకి జులై 24న రిలీజ్ అవుతుంది. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది.