ఏపీ రైతులకు అలర్ట్.. అన్నదాత సుఖీభవపై అప్‌డేట్.. డబ్బులు పడేది అప్పుడే?

Wait 5 sec.

ఎప్పుడు పడతాయనే నిరీక్షణకు త్వరలోనే ఎండ్ కార్డు పడనుంది. జూలై నెలలో కింద అర్హులైన రైతులకు రూ.7000 బ్యాంక్ ఖాతాలో పడతాయనే వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. కేంద్ర ప్రభుత్వ పథకమైన యోజనతో కలిపి చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన అనే పేరు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తే తాము కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు అప్పుడు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధుల విడుదల కోసం దేశవ్యాప్తంగా రైతులు ఎదురు చూస్తున్నారు. సుమారుగా పదికోట్ల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ యోజన 20వ విడత నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్ట్ 2వ తేదీన వారణాసిలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ వారణాసి పర్యటనలోనే పీఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేస్తారంటూ జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వాస్తవానికి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2000 చొప్పున.. ఏటా మూడు విడతల్లో రూ.6000 జమ చేసేలా పీఎం కిసాన్ యోజన రూపకల్పన చేశారు. అయితే పీఎం కిసాన్ యోజన 19వ విడత నిధులను ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ విడుదల చేశారు. దీంతో ఇప్పటికి నాలుగు నెలలు దాటిపోవటంతో పీఎం కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తారా అని రైతులు ఎదురుచూస్తున్నారు. ఏపీ విషయానికి వస్తే పీఎం కిసాన్ యోజనతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5000 కలిపి.. మొత్తంగా రూ.7000 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. దీంతో మోదీ వారణాసి పర్యటనలో పీఎం కిసాన్ యోజన డబ్బులు విడుదల చేస్తే ఏపీ రైతులకు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా అప్పుడే విడుదలయ్యే ఛాన్సుంది. అన్నదాత సుఖీభవ గడువుచేసుకునేందుకు జూలై 23 వరకూ అవకాశం ఉంది. ఈ గడువు కూడా ముగియనుండటంతో అర్హులైన రైతులు త్వరపడాలని అధికారులు కోరుతున్నారు. ఇక అన్నదాత సుఖీభవ పథకం స్టేటస్ చెక్ చేసుకోవడానికి కూడా అనేక మార్గాలు ఉన్నాయి. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ 155251 సైతం ఏర్పాటు చేశారు. అలాగే మనమిత్ర వాట్సా్ప్ గవర్నెన్స్, అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా కూడా పథకం స్టేటస్ చెక్ చేసుకునే వీలుందని అధికారులు చెప్తున్నారు.