ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో మరోసారి బీపీఎస్ (BPS), ఎల్ఆర్ఎస్ (LRS) పథకాలను తీసుకురాబోతోంది. ఈ మేరకు రాష్ట్రంలో అనుమతులు లేని భవనాలు, లేఅవుట్‌లను క్రమబద్ధీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోదం తర్వాత దీనికి సంబంధించిన. ఈ పథకాల ద్వారా నగర, పట్టణ ప్రజలు తమ నిర్మాణాలను, ప్లాట్లను చట్టబద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఈ పథకాలు తెచ్చింది.. అయితే గడువు ముగియడంతో వాటిని నిలిపివేశారు. అప్పటి దరఖాస్తుల్లో చాలా వరకు పరిష్కారమయ్యాయి.. గత ప్రభుత్వంలో అనుమతులు లేకుండా చాలా నిర్మాణాలు జరిగాయి. ఇప్పుడు వాటిని క్రమబద్ధీకరించడానికి . 2014-19 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేసింది. అయితే ఆ గడువు ముగియడంతో ఆ తర్వాత వాటిని ఆపేశారు. అప్పటి దరఖాస్తుల విషయానికి వస్తే.. BPSకు సంబంధించి 90%, LRSలో 65% వరకు పరిష్కారం అయ్యాయి. గత ప్రభుత్వంలో అనుమతులు తీసుకోకుండా చాలా భవనాలు, లేఅవుట్‌లు ఏర్పాటు చేశారు. దీనికి కారణం ఆ పార్టీ నేతల అండదండలు ఉండటమే. ఈ భవనాలు, లే అవుట్ల విషయంలో అధికారులు కూడా చూసీ చూడనట్లు వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేశారు.. అందులో 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 30,065 ఇళ్లకు ఆస్తిపన్ను విధించలేదని తేలింది. అంతేకాదు అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్‌లు 20 వేలకు పైగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.అనకాపల్లి, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఇలాంటి లేఅవుట్‌లు ఎక్కువగా ఉన్నాయి. LRS ద్వారా వాటిల్లో ప్లాట్లు కొన్నవారు వాటిని క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇలాంటి ప్లాట్లు 50 వేలకు పైగా ఉంటాయని అంచనా.. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ప్లాట్లను చట్టబద్ధం చేసుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఊరటనిచ్చే విషయం కాగా.. చాలా మందికి ఈ పథకాలు ఉపయోగపడ్డాయి.