Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న బిగ్ షాక్. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ లక్ష మార్క్ దాటేశాయి. తులం రేటు లక్షకు పైగా పలుకుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరగడం, రష్యా వద్ద చమురు కొంటే భారత్‌పై 100 శాతానికిపైగా సుంకాలు విధిస్తామని నాటో దేశాలు హెచ్చరికలు చేయడం వంటి కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు బంగారంలోకి పెట్టుబడులు పెరిగేలా చేస్తున్నాయి. దీంతో గిరాకీ పెరిగి ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ మళ్లీ పెరిగాయి. రికార్డ్ గరిష్ఠాల వైపు దూసుకెళ్తున్నాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు క్రితం రోజుతో పోలిస్తే 0.30 శాతం వృద్ధితో 10.10 డాలర్లు పెరిగి 3350 డాలర్ల స్థాయికిచేరుకుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్క ధర 0.46 శాతం మేర పెరిగి 38.22 డాలర్ల వద్దకు ఎగబాకింది. హైదరాబాద్‌లో తులం బంగారం లక్ష కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తులం బంగారం రేటు మళ్లీ లక్ష దాటింది. ఇవాళ 24 క్యారెట్ల పసిడి ధరలు తులానికి రూ. 660 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ. 10,0040 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాలు తయారు చేసే బంగారం రేటు ఇవాళ తులానికి రూ. 600 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ. 91 వేల 700 స్థాయికి దూసుకెళ్లింది. మళ్లీ పెరిగిన వెండి ధరహైదరాబాద్ మార్కెట్లో వెండి రేట్లు మళ్లీ పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే రూ. 1000 మేర పెరగడంతో కిలోకు రూ. 1,26,000 స్థాయికి చేరుకుంది. అయితే, ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి ప్రధాన మార్కెట్లలో కిలో వెండి రేటు రూ. 1,16,000 స్థాయిలో కొనసాగుతుండడం గమనార్హం. ఈ కథనంలో చెప్పిన బంగారం, వెండి రేట్లు జూలై 20వ తేదీన ఆదివారం ఉదయం 7 గంటలకు ఉన్న రేట్లు. అయితే మధ్యాహ్నానికి బంగారం రేట్లు మారవచ్చు. అలాగే పన్నులతో లెక్కిస్తే పసిడి ధరలు ప్రాంతాలను బట్టి వేరుగా ఉంటాయి. కొనే ముందు మీ ప్రాంతంలో స్థానిక జువెలర్స్ వద్ద ధరలను తెలుసుకోవడం మంచిది.