పింఛన్ల పంపిణీపై మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఇక నుంచి వారికి మాత్రమే..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా.. సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన చేయూత పెన్షన్ల పంపిణీపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆమె ఈ ముఖ్య వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో సెర్ప్ (SERP) సీఈవో దివ్యా దేవరాజన్, డైరెక్టర్ గోపి, జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్లు, అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీలో నూతన టెక్నాలజీని తప్పనిసరిగా అందిపుచ్చుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, సులువుగా పెన్షన్ అందేలా ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలన్నారు. ముఖ్యంగా.. ఫేషియల్ రికగ్నిషన్ వంటి అధునాతన పద్ధతుల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పెన్షన్లు అందించడం ప్రభుత్వ సామాజిక బాధ్యత అని పునరుద్ఘాటించిచారు. ‘నిజమైన లబ్ధిదారులకు పెన్షన్ చేరే విధంగా అధికారులు కఠిన నిబంధనలు అమలు చేయాలి’ అని ఆమె స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో పెన్షన్ పంపిణీ ఆలస్యమైతే.. ముందే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ సౌకర్యం ద్వారా వేలి ముద్రలు పడగా.. పెన్షన్ తీసుకోవడంలో ఇబ్బందులకు ఉంటుంది. ఇదిలా ఉండగా.. వేస్తోందని మంత్రి సీతక్క వివరించారు. 15 సంవత్సరాల వయస్సు నుంచే మహిళలను మహిళా సంఘాలలో సభ్యులుగా చేర్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ‘మహిళ ఆర్థికంగా ఎదిగితే కుటుంబం బాగుపడుతుంది’ అని ఆమె అన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాకుండా.. ఇందిరా మహిళా క్యాంటీన్లు, ప్రమాద బీమా ద్వారా పేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘మహిళలు ఫ్రీ బస్సు ఎక్కడమే కాదు... మహిళలను బస్సు ఓనర్లను చేసింది మా ప్రభుత్వం’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ పథకం మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. పేదరికం తగ్గించకపోతే సమాజంలో అంతరాలు పెరుగుతాయని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ‘పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులకు... అదే వారి ధైర్యం’ అంటూ వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు.