నా లైఫ్‌లో ఏదీ తేలిగ్గా దొరకలేదు.. డిప్యూటీ సీఎం అయినా అంత ఈజీగా సినిమా రిలీజ్ కాలేదు: పవన్ కళ్యాణ్

Wait 5 sec.

నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో రిలీజయింది. ప్రీమియర్ షోల నుంచే ఈ పాన్ ఇండియా చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రివ్యూలు కూడా ఏమంత గొప్పగా లేవు. దీనికి తోడు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావం కూడా వీరమల్లుపై పడింది. అయినప్పటికీ ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్స్ కలుపుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి నంబర్స్ వస్తాయని చిత్ర బృందం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా రిలీజైన రోజు సాయంత్రమే సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన నేరుగా హైదరాబాద్ వచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను అంటూ సక్సెస్ మీట్ లోనే ఒక పోడియం సెట్ చేసుకున్నారు. ''క్యాబినెట్‌ మీటింగ్ వల్ల ఇక్కడికి రావడానికి రావడం ఆలస్యమైంది. క్షమించండి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా సక్సెస్‌ మీట్‌కు వచ్చా. సినిమా ప్రమోషన్స్, సక్సెస్ మీట్లు నాకు అలవాటు లేదు. పొద్దున క్యాబినెట్ లో పంచాయతీరాజ్‌ శాఖపై మాట్లాడా. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా నేను పంచాయతీలు చేసి, సినిమా పంచాయితీలు చేసి రిలీజ్ చేయాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు'' అని పవన్ కళ్యాణ్ అన్నారు.''నా లైఫ్ టైంలో ఏదీ నాకు తేలిగ్గా దొరకలేదు. అందరికీ ఇలానే ఉంటుందేమో తెలియదు కానీ.. నా లైఫ్ లో ఏదీ కూడా వడ్డించిన విస్తరి కాదు. పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం కదా, సినిమా అలా సులువుగా రిలీజ్ అవ్వాలి కదా అంటే.. కానీ అలా అవ్వదు. ఎన్నో ఇబ్బందులు పడాలి.. పంచాయితీలు చేయాలి. నాకు అలసట వస్తుంది. గత వారం రోజులుగా నిద్ర లేదు. గత రెండు రోజుల్లో నేను మాట్లాడినన్ని విషయాలు, నా 29 ఏళ్ల సినీ జీవితంలో 10 శాతం కూడా మాట్లాడలేదు. సినిమా గురించి మాట్లాడకూడదు. ఒంటరిగా ఉందాం అనుకునేవాడిని పబ్లిక్ లైఫ్ లోకి వచ్చా. సక్సెస్ లకు అతీతంగా ఉండాలని అనుకుంటే, ఈ సినిమాని ప్రమోట్ చేసుకునే పరిస్థితికి నన్ను తీసుకొచ్చారు'' అని పవన్ కళ్యాణ్ నవ్వుతూ అన్నారు.