: . ఇది కేవలం మహిళలు ఆభరణంగా ధరించడానికే కాదు.. పెట్టుబడులకు కూడా సురక్షితమైన సాధనంగా ఉంది. అయితే.. ఇటీవల వరుసగా పెరుగుకుంటూ పోతున్న బంగారం.. ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాల్ని అందిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంటే 6-7 నెలల్లో కూడా మంచి రాబడి ఇచ్చింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజిలో (MCX) పసిడి 30 శాతం పెరిగింది. వెండి దాదాపు 35 శాతం ఎగబాకింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఈ సమయంలో 4.65 శాతమే పెరగ్గా.. బీఎస్ఈ సెన్సెక్స్ 3.75 శాతం మాత్రమే లాభపడింది. ఇదే సమయంలో బంగారం.. దిగ్గజ రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లనే దాటేయడం విశేషం. ఇవి వరుసగా 14 శాతం, 12.50 శాతం మాత్రమే పుంజుకున్నాయి. ఈ సమయంలో.. బంగారం, వెండి ఇతర ఆస్తులన్నింటినీ అధిగమించాయి. దీర్ఘకాలంలో కూడా బంగారం.. మార్కెట్‌ను శాసించింది. 6 సంవత్సరాలలో ఎంసీఎక్స్ గోల్డ్ రేటు రూ. 32 వేల స్థాయి నుంచి రూ. 97,800 కు పెరిగింది. అంటే ఇక్కడ ఆరేళ్లలో ఏకంగా 200 శాతం పెరిగిందని చెప్పొచ్చు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య వివాదాల కారణంగా కేంద్ర బ్యాంకులు సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ డాలర్‌పై నమ్మకం సన్నగిల్లడం, భౌగోళిక రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల పెరుగుతున్నాయి. దీంతో బంగారం దీర్ఘకాలికంగా మంచి రాబడిని అందించగలదని నిపుణులు అంటున్నారు.ఇదే సమయంలో కేంద్ర బ్యాంకులు.. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించడానికి తమ నిల్వల్ని వైవిధ్యపరుస్తున్నాయి, దీని కారణంగా బంగారం వైపు ఆసక్తి పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత అనిశ్చితి వాతావరణం దీర్ఘకాలంలో బంగారం ధర మరింత పెరిగేందుకు సంకేతాలు ఇస్తున్నట్లు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ కేంద్ర బ్యాంకులు.. బంగారాన్ని వ్యూహాత్మకంగా కొనుగోలు చేయడం కొనసాగిస్తే, బంగారం ధరలకు మరింత బలం చేకూరుతుందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనడం మంచిదేనా అని ఆలోచిస్తే, పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టడం కొనసాగించాలని SS వెల్త్‌స్ట్రీట్ ఫౌండర్ సుగంధ సచ్‌దేవా సూచించారు. రానున్న ఐదేళ్లలో బంగారం ధర తులానికి రూ. 1.40 లక్షల వరకు చేరొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశీయంగా బంగారం ధరల్ని పరిశీలిస్తే హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్స్ గోల్డ్ రేటు తులం రూ. 91,600 కు చేరింది. ఇంకా 24 క్యారెట్ల పసిడి ధర చూస్తే తాజాగా రూ. 550 తగ్గడంతో 10 గ్రాములకు రూ. 99,930 కు పడిపోయింది.