ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ వచ్చేస్తోంది.. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంకు సీఎం తెలిపారు. అలాగే లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది అన్నారు. అలాగే ఉమ్మడి విశాఖపట్నంజిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ త్వరలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని.. కలెక్టర్ల సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు.రాయలసీమలో కడప ఉక్కు కర్మాగారం, కొప్పర్తి, ఓర్వకల్లులో పరిశ్రమలను అభివృద్ధి చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి. రాబోయే రోజుల్లో అనంతపురంలోని లేపాక్షి, కర్నూలులోని ఓర్వకల్లు మధ్య ప్రాంతం భారీ ఇండస్ట్రియల్ హబ్‌గా మారుతుందన్నారు. లాజిస్టిక్ కార్పొరేషన్ ద్వారా పోర్టులు, విమానాశ్రయాల మధ్య రోడ్డు నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు కానీ, నౌకల తయారీ కేంద్రం కానీ లేదా ఫిషింగ్ హార్బర్ కానీ ఏర్పాటు చేయాలని చంద్రబాబు అన్నారు. కొత్త విమానాశ్రయాల నిర్మాణంతో ఆ ప్రాంతం ఎకనామిక్ హబ్‌గా మారుతుందన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు. పరిశ్రమల పెట్టుబడులు సక్రమంగా జరిగేలా చూడాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ కలెక్టర్లకు సూచించారు. పెట్టుబడులకు ఉన్న సమస్యలను ప్రతి 15 రోజులకు ఒకసారి సమీక్షించాలని ఆయన అన్నారు. ప్రతి మంగళవారం 'ఇండస్ట్రీ డే' నిర్వహించి పరిశ్రమల సమస్యలు పరిష్కరించాలని తెలిపారు. కలెక్టర్ల సదస్సులో ఆయన ఈ విషయాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పెట్టుబడుల ప్రతిపాదనలు సాకారం కావడానికి ఉన్న ఇబ్బందులపై దృష్టి పెట్టాలని యువరాజ్ అన్నారు. ప్రతి సోమవారం "గ్రీవెన్స్ డే" తరహాలోనే ప్రతి మంగళవారం "ఇండస్ట్రీ డే" నిర్వహించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఇప్పటివరకు 14 రంగాలకు చెందిన రూ.10.06 లక్షల కోట్ల పెట్టుబడులకు అనుమతులు లభించాయి. మొత్తం 122 ప్రాజెక్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పునరుత్పాదక విద్యుత్ అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) ద్వారా రూ.5,08,003 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పరిశ్రమల శాఖ ద్వారా రూ.4,62,453 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ.30,061 కోట్ల పెట్టుబడులు వస్తాయి. పర్యాటక శాఖలో రూ.3,335 కోట్ల పెట్టుబడులు వస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.2,947 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల రాకతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కొత్త చర్యలు చేపట్టింది. పెట్టుబడి ప్రతిపాదనల గురించి తెలుసుకోవడానికి కలెక్టర్లకు ప్రత్యేక లాగిన్ సదుపాయం కల్పించారు. ప్రతి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి ఒక కాలపరిమితిని కూడా నిర్ణయించారు. ఎకనమిక్ హబ్‌లో సమస్యలను పరిష్కరించడానికి ఒక అధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 20 క్లస్టర్లతో పాటు, కొత్తగా 30 క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం 1.1 లక్షల ఎకరాల భూమిని గుర్తించారు. పారిశ్రామిక కారిడార్ల దగ్గర 15 క్లస్టర్ల కోసం 74,583 ఎకరాలు కేటాయించారు. తీరం వెంబడి 15 క్లస్టర్ల కోసం 56,608 ఎకరాలను గుర్తించారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి రిటైర్ అయిన ఉద్యోగుల సహాయం తీసుకోవాలని సూచించారు.