కురుస్తాయంటోంది వాతావరణశాఖ. అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో ఇవాళ చిత్తూరు, కడప, అన్నమయ్య, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కురుస్తాయని అంచనా వేస్తున్నారు. బుధవారం వైఎస్సార్‌ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వానలు పడతాయి అంటున్నారు. 'సోమవారం సాయంత్రం 6 గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 57మిమీ, రాజమహేంద్రవరంలో 42మిమీ, కాకినాడ జిల్లా పిఠాపురంలో 37.2మిమీ, కందరాడలో 36.7మిమీ, వర్షపాతం నమోదైంది' అని తెలిపారు. కాకినాడ, రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. గంటపాటు ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో నగరాలు జలమయమయ్యాయి. రహదారులు, కాలనీలు నీట మునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన కాలువలు నిండి మురుగు నీరు రోడ్లపైకి వచ్చింది.ఉత్తర తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న విదర్భ ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. సంబంధిత ఉపరితల ఆవర్తనం , ఇపుడు సగటు సముద్ర మట్టానికి 4.5 కి.మీ. వరకు విస్తరించి, నైరుతి దిశగా ఎత్తుకు వంగి ఉంది. ఇది పశ్చిమ వాయువు దిశగా విదర్భ మధ్య ప్రాంతాల వైపు, పరిసర ప్రాంతాల వైపు కదిలే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది దాదాపు ఉత్తరం వైపు కదిలి, అవశేష ఉపరితల ఆవర్తనముగా మారే అవకాశం ఉంది అని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో రాబోయే 4 రోజులు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు ఒకటి, రెండు చోట్ల భారీ వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే వర్సాలు ఉరుములతో పడేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. నైరుతి రుతుపవనాలు వెనుదిరుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి అవి పూర్తిగా వెళ్లిపోతాయి. దీనికి వాతావరణం అనుకూలంగా ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం బలహీనపడింది. అయితే ఈ ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 18న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర పరిసరాల్లోని అల్పపీడనం బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం మాత్రం ఇంకా ఉంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.