తెలంగాణ రాష్ట్రంలో జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇప్పటికీ పలుచోట్ల తేలికపాటి నుండి భారీ వర్షాలు కురుస్తుండగా.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. నేటి నుంచి నాలుగు రోజుల పాటు పలు జిల్లా్ల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వాయువ్య, పశ్చిమ మధ్య కొనసాగుతూ.. సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా వంగి ఉండడం వల్ల రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి, కొత్తగూడెం, ఖమ్మం, హన్మకొండ, జనగాం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చునని చెప్పారు. రేపు (గురవారం) ఆసిఫాబాద్, మంచిర్యాల, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం నిజామాబాద్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడవచ్చునని అన్నారు. ఈనెల 13న (శనివారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, నిర్మల్, కొత్తగూడెం, భువనగిరి,మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.గత 24 గంటల్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, కరీంనగర్, సూర్యాపేట జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తాంసిలో 6.4 సెం.మీ., నేరడిగొండలో 8.1 సెం.మీ. వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ (తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ) వెల్లడించింది. ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.