ఎట్టకేలకు ఏళ్ల కల సాకారం.. రూ. 1.30 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి..

Wait 5 sec.

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మంగళపల్లి గ్రామ ప్రజల సంవత్సరాల కల ఇప్పుడు నెరవేరింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పూర్తయి.. గ్రామానికి కొత్త వెలుగు తెచ్చింది. సుమారు రూ.1.30 కోట్ల నిధులతో కేవలం మూడు నెలల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. గ్రామ యువకులు, పెద్దలు చెప్పినట్లుగా.. గతంలో ఈ ప్రాంతానికి రావడం ఒక పెద్ద కష్టసాధ్యమైన విషయం. వర్షాకాలంలో మరింత ఇబ్బందులు తలెత్తేవి. కూరగాయలు, పూల సాగు ఆధారంగా జీవనోపాధి సాగించే ఈ గ్రామం రైతులు మార్కెట్లకు పంటలు తరలించడానికి తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు. రోడ్డు బాగోలేక, వాహనాలు నడపడం కష్టమై.. కొన్ని సార్లు ఆర్థిక నష్టాలనూ భరించాల్సి వచ్చిందని వారు గుర్తుచేసుకున్నారు. స్థానిక యువకులు ఒక దశలో సొంత ఖర్చుతో మట్టిని పోసి రహదారిని సర్దుబాటు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాక.. రహదారి నిర్మాణం కోసం కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన ఘనత గ్రామ చరిత్రలో ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఆ పట్టుదల, కృషి ఇప్పుడు ఫలితాన్ని ఇచ్చిందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడమే కాకుండా.. వేగంగా పనులు పూర్తి చేయడం ప్రజలకు నమ్మకాన్ని కలిగించిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. కొత్త రహదారి ద్వారా పంటలు సమయానికి మార్కెట్కు చేరుతాయన్న విశ్వాసం రైతుల్లో పెరిగింది. దీంతో పండించిన పంటకు ఫలితం ఉంటుంది. రైతు ప్రయాణ సౌకర్యం మెరుగవడంతో విద్యార్థులు, మహిళలు కూడా సులభంగా గ్రామం వెలుపలికి వెళ్ళగలుగుతున్నారు. మంగళపల్లి ఇప్పుడు పచ్చని పొలాలు, పూల తోటలు, కూరగాయల సాగుతో మరింత ప్రగతిశీల దిశగా సాగుతోందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ రహదారి ద్వారా గ్రామ అభివృద్ధికి కొత్త అవకాశాలు తలుపుతెరుస్తాయని ఆశాజనకంగా పేర్కొన్నారు.