నేపాల్ నుంచి స్వస్థలాలకు బయల్దేరిన ఏపీవాసులు.. ఫలించిన నారా లోకేష్ కృషి..

Wait 5 sec.

ఆందోళనలు, హింసాత్మక ఘటనలతో పొరుగు దేశం నేపాల్ అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేపాల్ వెళ్లిన తెలుగు ప్రజల భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. అక్కడకు వెళ్లిన వారితో పాటుగా, ఇక్కడ ఉన్న వారి కుటుంబసభ్యులు కూడా భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించేందుకు ఏపీ మంత్రి చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని మరీ.. నారా లోకేష్ వార్ రూమ్ ఏర్పాటు చేసి నేపాల్‌లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ చర్యలు ఫలించి స్వదేశానికి పయనమవుతున్నారు. నేపాల్‌లో 12 ప్రాంతాల్లో 217 మంది ఆంధ్రప్రదేశ్‌వాసులు చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించారు. తొలివిడతగా నేపాల్‌లోని హెటౌడా నుంచి 22 మంది ఏపీ వాసులనుసురక్షితంగా బీహార్ బోర్డర్ తరలిస్తున్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో వీరంతా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మరోవైపు ఖాట్మాండు పరిసరాల్లో ఉన్న 173 మందిని తరలించేందుకు గురువారం ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఖాట్మాండు వెళ్లనుంది. ఖాట్మాండూలో కర్ఫ్యూ సడలించిన వెంటనే విమానంలో వీరందరిని విశాఖపట్నం, విజయవాడ తరలించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్నవారికి నారా లోకేష్ వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పారు. కేంద్రంతో మాట్లాడి క్షేమంగా తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ప్రత్యేక విమానాల ద్వారా రాష్ట్రానికి సురక్షితంగా తీసుకువస్తామని ధైర్యం చెప్పారు. మరోవైపు నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారి కోసం టోల్ ఫ్రీ నంబర్లు, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. +91 9818395787 నంబర్ అందుబాటులో ఉంచారు. అలాగే 24 గంటలు సేవలు అందించేలా RTG (24x7): 08632381000 Ext: 8001/8005 నంబర్లు ఏర్పాటు చేశారు. APNRTS Helpline: 0863 2340678, WhatsApp: +91 8500027678, Email: helpline@apnrts.com / info@apnrts.com ‌లను అందుబాటులో ఉంచారు.