ఆసియాకప్ 2025లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా.. తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్.. ఫస్టు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. అయితే టాస్ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. సాధారణంగా టాస్ సందర్బంగా ఇరు జట్ల కెప్టెన్‌లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం అనవాయితీ. అయితే టీమిండియా కెప్టెన్ .. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు! షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో ఈ విషయం చర్చనీయాశంగా మారింది.పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో పాకిస్థాన్‌తో క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్‌లు వినిపించాయి. పలువురు మాజీ క్రికెటర్లు సహా.. పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ బాయ్‌కాట్‌ భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ అని డిమాండ్ చేశారు. కానీ భారత ప్రభుత్వం మాత్రం ఈ మ్యాచ్‌లో టీమిండియా పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆసియాకప్‌లో భారత్.. పాక్‌తో మ్యాచ్ ఆడుతోంది. కొన్ని రోజుల నుంచి ఈ మ్యాచ్‌పై తీవ్ర వ్యతిరేకత ఉంది. సోషల్ మీడియాలోనైతే.. ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం సైతం జరిగింది. కానీ బీసీసీఐ మాత్రం మ్యాచ్ నిర్వహణకే మొగ్గుచూపింది. ఈ పరిస్థితుల్లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. పాకిస్థాన్ కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం గమనార్హం.ఆసియాకప్‌లో భారత్, పాక్ మ్యాచ్ కోసం తుది జట్లు..భారత్‌ జట్టు: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ (వైస్ కెప్టెన్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్‌ చక్రవర్తిపాకిస్థాన్‌ జట్టు: సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్‌ ఆయూబ్, మహ్మద్‌ హారిస్ (వికెట్‌ కీపర్‌), ఫకర్‌ జమాన్‌, సల్మాన్‌ ఆఘా (కెప్టెన్‌), మహ్మద్‌ నవాజ్‌, ఫహీమ్‌ అష్రఫ్‌, షహీన్‌ అఫ్రిదీ, సుఫియాన్‌ ముఖీమ్, అబ్రార్‌ అహ్మద్‌