ఏపీలో కొత్త ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం.. ఈ ప్రాంతంలోనే ఫిక్స్

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌‌లో బస్టాండ్‌లలో మౌలిక సదుపాయాలు, కొత్త బస్టాండ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఈ మేరకు స్వయంగా ఆర్టీసీ వైస్ ఛైర్మన్, ఎండీ ద్వారకా తిరుమలరావు బస్టాండ్లను పరిశీలిస్తున్నారు. తాజాగా తిరుమలరావు ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న అద్దంకి ఆర్టీసీ డిపోను పరిశీలించారు. అద్దంకిలో త్వరలో కొత్త బస్టాండ్ కడతామని చెప్పారు. రెండు మూడేళ్లలో అత్యాధునిక బస్టాండ్ నిర్మాణం జరుగుతుందన్నారు.ద్వారకా తిరుమలరావు అద్దంకి బస్టాండ్, గ్యారేజీలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్మికులతో మాట్లాడి, బాగా పనిచేసిన వాళ్లని అభినందించారు. అద్దంకి బస్టాండ్ దగ్గర షాపుల వల్ల ఆర్టీసీకి మంచి ఆదాయం వస్తోందన్నారు తిరుమల రావు. ఇక్కడ స్థలం చాలా విశాలంగా ఉందని.. కాబట్టి ముందు షాపింగ్ కాంప్లెక్స్ కట్టి, వెనకవైపు కొత్త బస్టాండ్ కడతామన్నారు. దీనివల్ల ఆర్టీసీకి మరింత ఆదాయం వస్తాయని.. కొత్త బస్టాండ్ కడితే ఆర్టీసీకి లాభాలు పెరుగుతాయన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో విజయవంతంగా అమలవుతోందన్నారు తిరుమలరావు. పొరుగు రాష్ట్రంలో ఈ పథకం అమలులో కొన్ని సమస్యలు వచ్చాయన్నారు. కానీ ఏపీలో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని.. పెరిగిందన్నారు. గతంలో 40% మంది మహిళలు ప్రయాణించేవారని.. ఇప్పుడు ఆ సంఖ్య 65%కి చేరిందన్నారు. మరిన్ని బస్సుల్లో ఈ పథకం అమలు చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.ప్రయాణికుల సంఖ్య పెరిగినందున అన్ని బస్టాండ్‌లలో వసతులు మెరుగుపరుస్తున్నామన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2550 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేస్తున్నారని.. కొత్త బస్సులు వచ్చే వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నాము అన్నారు. ఉన్న బస్సులనే ఎక్కువ ట్రిప్పులు తిప్పేలా చూస్తున్నారని.. బస్సుల మెయింటినెన్స్ కూడా పెంచుతున్నారన్నారు. ఖర్చు తగ్గించడంతో పాటు టికెట్ లేని ఆదాయం పెంచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కార్మికుల మంచి కోసం పూర్తిగా సహాయం చేస్తోందన్నారు ఆర్టీసీ ఎండీ. మెరుగైన వైద్యం అందించి 1200 మంది కార్మికులను కాపాడినట్లు అధికారులు తెలిపారు. స్త్రీశక్తి పథకం వల్ల బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. దీంతో బస్సులు తరచుగా రిపేర్లకు వస్తున్నాయన్నారు. ఆయిల్ ఖర్చు ఎక్కువ అవుతోందన్నారు.