అదిరిపోయే ఫీచర్లతో ఐఫోన్ కొత్త సిరీస్.. రేట్లు ఎంత.. బుకింగ్స్ ఎప్పటినుంచి?

Wait 5 sec.

: సంగతి తెలిసిందే. ఇక యాపిల్ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంటారు. కొత్త మోడల్ ఏదైనా విపణిలోకి వస్తే.. ఇట్టే క్షణాల్లోనే బుకింగ్స్ అయిపోతుంటాయి. అంతటి డిమాండ్ ఉంటుంది మరి. ఇక ఇప్పుడు టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన యాపిల్ అతిపెద్ద ఈవెంట్ ముగిసింది. యాపిల్ పార్క్‌లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 10.30 గంటలకు ఈ ఈవెంట్ జరగ్గా.. ఇందులో సరికొత్త ఐఫోన్లను విడుదల చేసింది. ఎప్పటిలాగా ఏటా కొత్త సిరీస్ లాగా.. ఈసారి ఐఫోన్ 17ను ఆవిష్కరించింది యాపిల్. ఇందులో మొత్తం 4 మోడల్స్.. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ (ఫ్లాగ్‌షిప్ ఫోన్) పరిచయం చేసింది. ఇదే యాపిల్ ఈవెంట్లో ఫోన్స్‌తో పాటు.. న్యూ జెనరేషన్ ఎయిర్‌పాడ్స్ ప్రో3, స్మార్ట్ వాచ్ సిరీస్ SE3, 11 వాచ్‌లను పరిచయం చేసింది. ఈ ఐఫోన్స్ అన్నీ ఈ నెల 12 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానుండగా.. 19 నుంచి అందుబాటులోకి వస్తాయి. ఐఫోన్ 17: ఇది ఇ. మన్నిక, డిజైన్ కూడా అంతకుముందు కంటే మెరుగ్గా రూపొందించినట్లు వెల్లడించింది. ఇక్కడ 6.3 అంగుళాల ప్రో - మోషన్ డిస్‌ప్లే, సిరామిక్ షీల్డ్ 2, ఏ19 చిప్ సెట్‌తో వస్తోంది. 5 రంగుల్లో ఈ బేసిక్ మోడల్ అందుబాటులో ఉంది. 256 GB ప్రారంభ స్టోరేజీ, 40MP కెమెరా, సెంటర్ స్టేజ్ ఫ్రంట్ కెమెరా, యాపిల్ ఇంటెలిజెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర అమెరికాలో 799 డాలర్లు. మన దగ్గర రూ. 82,900 నుంచి ప్రారంభం అవుతున్నాయి. ప్రారంభ ధరలు అన్నీ 256 GB తో వస్తున్నాయి.ఐఫోన్ 17 ఎయిర్: ఐఫోన్ చరిత్రలోనే అత్యంత నాజూగ్గా దీనిని రూపొందించారు. కేవలం 5.6 ఎంఎం మందంతో అతిపల్చగా తీసుకొచ్చింది. ఇక్కడ 6.5 అంగుళాల ప్రో మోషన్, 48 MP కెమెరా, ఏ19 ప్రో చిప్, సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 4 రెట్ల క్రాక్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉండగా.. 80 శాతం రీసైకిల్డ్ టైటానియంతో ఈ ఫోన్ తయారు చేశారు. ఇది 4 రంగుల్లో (బ్లూ, బ్లాక్, వైట్, గోల్డ్) అందుబాటులో ఉంది. దీని ధర 999 డాలర్లు. మన దగ్గర రూ. 1,19,900తో ప్రారంభం అవుతున్నాయి.ఐఫోన్ 17 ప్రో, 17 మ్యాక్స్: ఈ రెండూ కొత్త థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో వచ్చాయి. ఇది ఫోన్ వేడెక్కకుండా రక్షణ కల్పిస్తుంది. రెండింట్లో కూడా వెనుకవైపు 3 కెమెరాలు 48 MP తో తొలిసారి అందుబాటులోకి వచ్చాయి. ముందు సిరామిక్ షీల్డ్ 2 తో ఉంటాయి. 17 ప్రొ 6.3 అంగుళాలు, ప్రొ మ్యాక్స్ 6.9 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. వీటి ధరలు వరుసగా 1099, 1199 డాలర్లు. మన దగ్గర వరుసగా రూ. రూ. 1,34,900; రూ. 1,49,900 తో వస్తున్నాయి.