బంగారం ధరల్లో ఊహించని మార్పు.. రాత్రికి రాత్రే సీన్ రివర్స్.. తులం గోల్డ్ రేటు కొత్త రికార్డ్

Wait 5 sec.

Gold Rate Today: సరికొత్త రికార్డులను తాకాయి. కొంత కాలంగా రోజు రోజుకూ పెరుగుతూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. క్రితం రోజు స్వల్పంగా తగ్గి ఊరట కల్పించినా రాత్రికి రాత్రే సీన్ మారిపోయింది. పసిడి ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి షాకిచ్చాయి. బంగారం ధరలు పెరిగేందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అమెరికా సుంకాలు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలకు తోడు అంతర్జాతీయ ఉద్రిక్తతలు, దేశాల మధ్య యుద్ధాల వంటివి ఎన్నో అంశాలు బంగారం ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. డాలర్ విలువ తగ్గడంతో పాటు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనడంతో గిరాకీ పెరిగి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. రాత్రికి రాత్రే పసిడి ధరలు రికార్డ్ స్థాయిని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు సరికొత్త రికార్డును నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 3650 స్థాయిని తాకింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు 3624 స్థాయిలో ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 41 డాలర్లు దాటి కొత్త రికార్డ్ సృష్టించింది. ఇక రూపాయి విలువ కాస్త పుంజుకుని డాలర్‌తో పోలిస్తే రూ.88.234 వద్ద ట్రేడవుతోంది. హైదరాబాద్‌లో భారీగా పెరిగిన బంగారంహైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజు కాస్త తగ్గినట్లు కనిపించినా రాత్రికి రాత్రే సీన్ రివర్స్ అయింది. బంగారం రేట్లు భారీగా పెరిగాయి. ఇన్నాళ్లు 24 క్యారెట్ల గోల్డ్ రేటు మాత్రమే లక్ష మార్క్ దాటగా ఇప్పుడు22 క్యారెట్ల గోల్డ్ సైతం లక్ష మార్క్ దాటేసింది. ఇవాళ 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 10 గ్రాములకు రూ. 1250 మేర పెరిగింది. దీంతో తులం ధర రూ.1,01,100 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై రూ.1360 మేర పెరిగింది. దీంతో తులం స్వచ్ఛమైన బంగారం రేటు రూ.1,10,290 వద్దకు చేరుకుంది. రూ.3 వేలు పెరిగిన వెండిదీంతో కిలో ధర హైదరాబాద్ మార్కెట్లో రూ.1,40,000 స్థాయిని తాకింది. సరికొత్త రికార్డ్ స్థాయిని నమోదు చేసింది. అయితే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,30,000 స్థాయిలోనే లభిస్తుండడం గమనార్హం. పైన పేర్కొన్న బంగారం, సెప్టెంబర్ 10వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, మధ్యాహ్నానికి ధరలు మారుతుంటాయి. అలాగే జీఎస్టీ, మేకింగ్ ఛార్జీల వంటివి లెక్కలోకి తీసుకుంటే ధరలు ఎక్కువే ఉంటాయి. అలాగే ప్రాంతాలను బట్టి మారతాయి. కొనే ముందు మీ ప్రాంతంలోని ధరలు తెలుసుకోవడం మంచిది.