భారత్-పాక్ మ్యాచ్.. శాంసన్ ఔట్, అర్షదీప్ ఇన్.. టీమిండియా తుది జట్టు ఇదేనా!

Wait 5 sec.

ఆసియాకప్ 2025ని భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసింది. ఆ జట్టు 57 పరుగులకే ఆలౌట్ చేసి.. ఆపై 4.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే తొలి మ్యాచ్‌తో పోలిస్తే.. రెండో మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో భారత్ తుది జట్టు ఎంపిక విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. ఎందుకుంటే టీమిండియా మేనేజ్‌మెంట్ గత కొన్నేళ్లుగా టీ20ల్లో నమ్మదగ్గ బౌలర్‌గా ఉన్న పేసర్ అర్షదీప్ సింగ్‌ను పక్కనపెట్టింది. ప్రధాన పేసర్‌గా కేవలం బుమ్రాను మాత్రమే తీసుకుంది. అయితే రెండో మ్యాచ్‌లో అతడికి చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. పాకిస్థాన్ బ్యాటర్లలో కట్టడి చేయాలంటే అర్షదీప్ సింగ్ తుది జట్టులో ఉండాలని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఆల్‌రౌండర్‌ శివమ్ దూబే ప్లేసులో అతడు తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.సంజూ శాంసన్ ఔట్..యూఏఈతో మ్యాచ్‌లో సంజూ శాంసన్ వికెట్ కీపర్‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు. కానీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో అతడికి చోటు దక్కకపోవచ్చు. ఎందుకంటే గిల్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా ఫిక్స్ అయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. ఆ తర్వాత ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యాలు వస్తారు. దీంతో జట్టులోకి స్పెషలిస్ట్ ఫినిషర్‌ను తీసుకోవాలని భారత్ భావిస్తోంది! అందుకే ఐపీఎల్‌లో ఫినిషర్ రోల్‌ను సమర్థవంతంగా పోషించిన జితేశ్ శర్మను తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్‌ బెంచ్‌పై కూర్చునే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు అంచనా:అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జితేశ్‌ శర్మ (వికెట్ కీపర్‌), కుల్‌దీప్‌ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, వరుణ్ చక్రవర్తి