చేనేతలకు తీపికబురు.. అకౌంట్లోకి డబ్బులు.. చెక్ చేస్కోండి..

Wait 5 sec.

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. నేతన్నలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చేనేత కార్మికుల కోఆపరేటివ్‌ సొసైటీ (ఆప్కో) బకాయిలు పడిన డబ్బుల చెల్లింపులు ప్రారంభించింది. మొదటి విడతగా రూ.2 కోట్లకు పైగా బకాయిలను చెల్లించారు. 7 డివిజన్లలోని 84 సొసైటీల ఖాతాల్లో బకాయిల సొమ్ము జత చేసినట్లు ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే మిగిలిన బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు. ఆప్కో ద్వారా చేనేతలకు పడిన బకాయిలలో 20 శాతం మేరకు చెల్లించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రెండు కోట్లకు పైగా బకాయిల డబ్బులు 84 సొసైటీలకు చెల్లించారు. త్వరలోనే మిగతా వాటికి కూడా చెల్లిస్తామని మంత్రి వివరించారు. *మరోవైపు చేనేత సహకార సంఘాలు (సొసైటీ) నుంచి ఆప్కో వస్త్రాలు కొనుగోలు చేస్తూ ఉంటుంది. వీటిని ఆప్కో విక్రయశాలలు, ఆన్‌లైన్ ద్వారానూ విక్రయిస్తూ ఉంటుంది. అయితే చేనేత సహకార సంఘాలకు ఆప్కో సకాలంలో చెల్లింపులు చేయకపోవటంతో నేతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నిల్వలు పేరుకుపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తాజాగా సొసైటీలకు ఆప్కో బకాయిలు చెల్లించడం మొదలుపెట్టడంతో చేనేతలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు చేనేతల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతూ వస్తోంది.*అందులో భాగంగా చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి తెచ్చింది. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. అలాగే పవర్ లూమ్స్ నిర్వాహకులకు నెలకు 500 యూనిట్ల వరకూ ఫ్రీగా కరెంట్ అందిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా థ్రిఫ్ట్ ఫండ్ ద్వారా ఆర్థికంగా భరోసా అందిస్తున్నారు. అలాగే ఆప్కో ద్వారా చేనేత వస్త్రాలను డోర్ డెలివరీ చేసే ప్రక్రియకు కూడా శ్రీకారం చుట్టారు.* చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ పెంచేందుకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో చేనేత బజార్లను కూడా ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆప్కో ద్వారా పట్టుచీరలు వంటి చేనేత వస్త్రాలతో పాటుగా రెడీమేడ్ దుస్తులను కూడా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విక్రయాలు జరుపుతోంది. చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు చేనేత వస్త్రాలపై జీఎస్టీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.