ఆసియాకప్‌ 2025లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్‌లో యూఏఈని చిత్తు చేసిన భారత్.. రెండో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. దీంతో పాకిస్థాన్ బ్యాటర్లు బెంబేలెత్తిపోయారు. పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.ఎన్నో అంచనాలతో ఈ టోర్నీలో అడుగుపెట్టిన పాక్ ఓపెనర్ సయీమ్ ఆయూబ్ వరుసగా రెండో మ్యాచ్‌లు నిరాశపరిచాడు. ఒమన్‌తో మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన అతడు.. భారత్‌తో మ్యాచ్‌లోనూ అదే రిపీట్ చేశాడు. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో తొలి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే హారిస్ (3) కూడా బుమ్రా బౌలింగ్‌లో పెవిలియన్ చేరిపోయాడు. దీంతో మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది.ఆ తర్వాత ఫర్హమ్ (44 బంతుల్లో 40 రన్స్‌), ఫకర్ జమాన్ (15 బంతుల్లో 17 రన్స్‌) కాసేపు నిలబడ్డారు. కానీ వేగంగా రన్స్ స్కోరు చేయలేకపోయారు. గత మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన .. ఈ మ్యాచ్‌లోనూ అదరగొట్టాడు. 3 వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా సత్తాచాటడంతో పాకిస్థాన్ ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ చివర్లో షహీన్ అఫ్రిదీ (16 బంతుల్లో 33 రన్స్ నాటౌట్‌) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు.. 9 వికెట్ల నష్టానికి 127 రన్స్ స్కోరు చేసింది.భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ అత్యధికంగా మూడు వికెట్లు తీశాడు. , అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి ఒక్కో వికెట్ పడగొట్టారు. గత మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన ఆల్‌రౌండర్ శివమ్ దూబె ఈ మ్యాచ్‌లో ఒక్క ఓవర్ కూడా వేయలేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. అతడికి బంతి ఇవ్వలేదు. అభిషేక్ శర్మ ఒక ఓవర్ వేసి 5 రన్స్ ఇచ్చాడు. వికెట్ దక్కలేదు.