మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధర.. వారం తర్వాత ఇలా.. ఈరోజు తులం ఎంతుందంటే?

Wait 5 sec.

Gold Rate Today: మన దేశంలో బంగారానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. వందల సంవత్సరాల నుంచి భారతీయ సంస్కృతి, సాంప్రదాయాల్లో పసిడికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహిళలు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత గౌరవంగా భావిస్తారు. దీంతో ఎప్పుడూ కొంటూనే ఉంటారు. ఇక పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయ సమయంలో కచ్చితంగా బంగారం కొనాల్సిందే. దీంతో భారత్‌లో బంగారం క్రయ విక్రయాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఈ 2025 సంవత్సరంలో చూసుకుంటే బంగారం రేట్లు ఆకాశమేహద్దుగా పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులు, అమెరికా సుంకాలు, , భౌగోళిక వాణిజ్య, రాజకీయ పరిస్థితులు ఇలా చాలా అంశాలు పెరిగేందుకు కారణమవుతున్నాయి. అయితే ఇవాళ గరిష్ఠ స్థాయి నుంచి దిగివచ్చి మహిళలకు శుభవార్త అందించింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో సెప్టెంబర్ 14వ తేదీన బంగారం రేట్లు తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికార్డ్ స్థాయిలోనే ట్రేడవుతున్నాయి. ఈరోజు సైతం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 8.45 డాలర్లు పెరిగి 3643 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ ధర ఔన్సుకు 1.39 శాతం మేర పెరిగి 42.19 డాలర్ల వద్దకు చేరుకుంది. మరింత పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో తగ్గిన బంగారం ధర దసరా సీజన్ ప్రారంభం వేళ ధరలు దిగిరావడం మహిళలకు మంచి శుభవార్తగానే చెప్పవచ్చు. ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.110 తగ్గింది. దీంతో 10 గ్రాముల రేటు రూ.1,11,170 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రూ.100 తగ్గింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,01,900 వద్దకు చేరుకుంది. స్థిరంగానే వెండి రేటుబంగారాన్ని మించి వెండి పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. క్రితం రోజు కిలో వెండి రూ.2100 మేర పెరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ కాస్త శాంతించింది. పరుగులకు బ్రేకులు వేసింది. ఇవాళ వెండి రేటులో ఏ మార్పు లేకుండా స్థిరంగా ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.1,43,000 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అయితే, ఢిల్లీ, బెంగళూరు, ముంబై సహా పలు నగరాల్లో కిలో వెండి రేటు రూ.1,33,000 వద్ద లభిస్తుండడం గమనార్హం. పైన పేర్కొన్న గోల్డ్, సిల్వర్ రేట్లు సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం రోజు ఉదయం 7 గంటల సమయంలో ఉన్నవి. అయితే, బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు మధ్యాహ్నానికి మారుతుంటాయి. ప్రాంతాల వారీగా వేరు వేరుగా ఉంటాయి. కొనే ముందే ధరలు తెలుసుకోవాలి.