ఆంధ్రప్రదేశ్ ఫైబర్‌నెట్ ఛైర్మన్ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవికి ఇటీవల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అన్ని పదవులకు గుడ్ బై చెప్పిన ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఆయన తన న్యాయవాద వృత్తిపై ఫోకస్ పెడతానని ప్రకటించారు. ఈ క్రమంలో జీవీ రెడ్డి సరికొత్త జర్నీ ప్రారంభించారు.. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించారు. యువతకు ఆహ్వానం పలుకుతూ ట్వీట్ చేశారు జీవీ రెడ్డి., అడ్వకేట్స్ సంస్థ విస్తరిస్తోంది. న్యాయవాద పట్టభద్రులు (LLB పూర్తి చేసిన వారు), 0 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఈ సంస్థలో చేరవచ్చు. "ఖచ్చితత్వం, నిజాయితీ, ప్రభావవంతమైన వ్యాజ్యంతో నిర్మించబడిన" సంస్థలో భాగం అవ్వండి. ఇది ఒక మంచి అవకాశం' అంటూ చేశారు. యువ లాయర్లకు ఇది మంచి అవకాశం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. జీవీ రెడ్డికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. తన రాజీనామా తర్వాత ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. 'నేను నా వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుంది. తక్కువ కాలంలోనే టీడీపీ లోనూ, ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలు అప్పగించడం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. ఈ అవకాశానికి నేను ఎప్పటికీ మా సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మా సార్ ముఖ్యమంత్రి అవ్వాలి. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం ప్రతి అభివృద్ధి కోరుకునే తెలుగు వ్యక్తి బాధ్యత' అంటూ ఆకాంక్షించారు.ఫైబర్ నెట్ ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపులపై సంచలన ఆరోపణలు చేశారు. ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులైన ఉద్యోగులను తొలగించినా దినేష్ కుమార్ ఆమోదం తెలపలేదని జీవీ రెడ్డి అన్నారు. ఫైబర్ నెట్ ఉద్యోగులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. వైఎస్సార్‌సీపీకి సహకరించేలా కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. దీనివల్ల సంస్థకు నష్టం వాటిల్లుతోందన్నారు. ఈ క్రమంలో తర్వాత పరిణామాలతో జీవీ రెడ్డి పదవులకు రాజీనామా చేశారు. జీవీ రెడ్డి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు.. ఆ తర్వాత టీడీపీలో చేరారు.