ఈ 2025లో 39శాతం పెరిగిన బంగారం ధర.. ఎప్పుడు తగ్గుతుంది? నిపుణుల అంచనాలు ఇవే

Wait 5 sec.

Gold Price: పసిడి ప్రియులకు ధరల షాక్ తగులుతోంది. రోజు రోజుకు ఆకాశమే హద్దుగా పరుగులు పెడుతున్నాయి. తాజాగా దేశీయ మార్కెట్లో బంగారం ధర సరికొత్త రికార్డును తాకింది. అంతే కాదు ఈ 2025లో ఇప్పటి వరకు చూసుకుంటే బంగారం రేటు ఏకంగా 39 శాతం మేర పెరిగింది. అంతకు ముందు ఏడాది 2024లో 27 శాతం మేర పెరగగా ఈసారి అంతకు మించిన వేగంతో దూసుకెళ్తోంది. అందుకు ప్రధానంగా డాలర్ విలువ తగ్గడం, కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు, మానీటరీ పాలసీ, ప్రపంచ అనిశ్చితుల వంటి కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా అమెరికా నిర్ణయాలు, డాలర్ విలువ, ఫెడ్ వడ్డీ రేట్ల అంచనాలు ఉన్నాయంటున్నారు.గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ రేటు 3600 డాలర్ల మార్క్ దాటింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, డాలర్ విలువ తగ్గడం, బాండ్ యీల్డ్స్ తగ్గడం సహా బంగారానికి గిరాకీ పెరిగిన క్రమంలో ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈరోజు ట్రేడింగ్ సెషన్‌లో ఔన్స్ గోల్డ్ రేటు ఒక దశలో 3659.10 డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. ఆతర్వాత కాస్త తగ్గినా రికార్డ్ స్థాయిలోనే ట్రేడవుతోంది. అలాగే అమెరికా గోల్డ్ ఫూచర్స్ డిసెంబర్ డెలివరీలు 0.4 శాతం పెరిగి 3692.40 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. బంగారం ధరలపై అంచనాలు.. వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు సరికొత్త రికార్డును తాకినట్లు నిపుణులు అంచనా వేశారు. అలాగే డాలర్ విలువ తగ్గడమూ బంగారం ధర 3600 డాలర్ల స్థాయిని తాకేందుకు కారణమైనట్లు చెబుతున్నారు. కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు మొగ్గు చూపడమూ బలం చేకూరినట్లు నామో మనీ చీఫ్ మర్కెట్ అనలిస్ట్ హన్ తన్ తెలిపారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 22 బేసిస్ పాయింట్ల మేర తగ్గించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 88 శాతం మేర 25 బేసిస్ పాయింట్ల తగ్గింపునకు ఛాన్స్ ఉండగా 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తారని 12 శాతం మంది అభిప్రాయం వెల్లడించారు. వడ్డీ తగ్గించడం డాలర్‌పై ఒత్తిడి పెంచుతుంది. దీంతో విలువైన ఖనిజమైన బంగారానికి గిరాకీ పెంచుతుంది. దీంతో ధరలు భారీగా పెరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అమెరికా నిరుద్యోగ రేటు, ద్రవ్యోల్బణం వంటివి ఇందుకు కారణమవుతాయని చెబుతున్నారు. అలాగే ఫెడ్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గిస్తో ఈ 2025 ముగిసే నాటికి గోల్డ్ రేటు 4000 డాలర్లను దాటుతుందని అంనచా వేస్తున్నారు. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 41.21 డాలర్లకు చేరింది. ప్లాటినం 1396.30 డాలర్లను తాకింది. పల్లాడిమ్ 0.4 శాతం పెరిగి 1138.16 డాలర్ల వద్దకు ఎగబాకింది. నిపుణుల అంచనాల ప్రకారం బంగారం ధరలు ఈ 2025లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, ఆర్థిక మాంద్యం భయాలకు తోడు బంగారానికి పెరుగుతున్న గిరాకీ ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే, మధ్య మధ్యలో కాస్త దిగివచ్చినా పెద్దగా తేడా ఉండదని అంటున్నారు. చిన్న చిన్న కారణాలతో బంగారం ధరలు స్వలంగా దిగిరావచ్చేమో గానీ భారీ స్థాయిలో తగ్గే అవకాశాలే లేవని చెబుతున్నారు. బంగారం ధరలు 2025 ముగిసే నాటికి భారీగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.