: దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారం కూడా ఐపీఓల సందడి నెలకొనుంది. లిస్టింగ్ గెయిన్స్ కోసం ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది పండగే అని చెప్పాలి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వారంలో 5 కంపెనీలు కొత్తగా పబ్లిక్ ఇష్యూకు వస్తున్నాయి. అలాగే మరో 11 కంపెనీల ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకుని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కానున్నాయి. ఇందులో ప్రధానంగా ఇన్వెస్టర్ల దృష్టిని అర్బన్ కంపెనీ ఆకర్షిస్తోంది. మరి ఏ కంపెనీ ఎప్పుడు వస్తోంది అనే వివరాలు తెలుసుకుందాం.మెయిన్ బోర్డు కేటగిరీలో వాల్ ప్యానెల్‌ల తయారీ కంపెనీ యూరో ప్రతీక్ సేల్స్ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 16వ తేదీన ప్రారంభమవుతోంది. సెప్టెంబర్ 18వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చు. ఒక్కో షేరుకు ధర రూ.235 నుంచి రూ.247గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 60 షేర్లు కేటాయించారు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా వస్తోంది. ప్రమోటర్లు తమ వాటా రూ.451.31 కోట్లు విలువైన షేర్లు విక్రయిస్తున్నారు.అలాగే.. గుజరాత్‌కు చెందిన వీఎంఎస్ టీఎంటీ (VMS TMT) టీఎంటీ ఇనుప కడ్డీల తయారీ కంపెనీ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ సెప్టెంబర్ 17న మొదలై 19వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఐపీఓలో ప్రైస్ బ్యాండ్ రూ.94 నుంచి రూ. 99గా నిర్ణయించారు. ఒక లాట్‌లో 150 షేర్లు కేటాయించారు. రూ. 148.50 కోట్లు విలువైన షేర్లను తాజా ఇష్యూ ద్వారా జారీ చేస్తున్నారు. ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను లోన్ చెల్లింపు, కార్పొరేట్ అవసరాలు ఉపయోగిస్తామని కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు.. టెక్‌డి సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 15న మొదలై 17వ తేదీ వరకు కొనాగుతుంది. రూ. 38.99 కోట్లు విలువై షేర్లను జారీ చేస్తున్నారు. ఒక్కో షేరు ధర రూ. 183-రూ.193గా నిర్ణయించారు. అలాగే సంపత్ అల్యూమినియం ఐపీఓ సెప్టెంబర్ 17న మొదలై 19వ తేదీ వరకు ఉంటుంది. రూ. 30.53 కోట్లు విలువైన ఇష్యూ ఇది. ధరల శ్రేణి రూ. 114- రూ. 120గా నిర్ణయించారు. జేడీ కేబుల్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమై 22వ తేదీ వరకు కొనసాగుతుంది. రూ. 95.99 కోట్ల షేర్లను జారీ చేస్తున్నారు. ఒక్కో షేరు ధర రూ. 144- రూ. 152గా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లుఈ వారం 11 కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవుతున్నాయి. ఇందులో అర్బన్ కంపెనీ ఐపీఓ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సెప్టెంబర్ 15వ తేదీన వశిష్ఠ లగ్జరీ ఫ్యాషన్ లిస్టింగ్ అవుతోంది. సెప్టెంబర్ 16వ తేదీన నిలాచల్ కార్బో మెటాలిక్స్, కృపాలు మెటల్స్, టౌరియన్ ఎంపీఎస్, కార్బన్‌ స్టీల్ ఇంజనీరింగ్ కంపెనీలు లిస్టింగ్ అవుతున్నాయి. సెప్టెంబర్ 17వ తేదీన అర్బన్ కంపెనీ, శ్రీంగర్ హౌస్ ఆఫ్ మంగళసూత్ర, దేవ్ యాక్సిలరేటర్, జే అంబే సూపర్ మార్కెట్స్, గెలాక్సీ మెడికేర్ కంపెనీల ఐపీఓలు లిస్టవుతున్నాయి.