మ్యాజిక్ చేసిన SBI స్కీమ్.. రూ.10 వేల పొదుపుతో రూ.1.54 కోట్లొచ్చాయ్..!

Wait 5 sec.

SBI Fund Returns: రిస్క్ తీసుకుని ఓపికతో పెట్టుబడులు కొనసాగించిన వారికే రివార్డ్స్ లభిస్తాయని మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా స్కీమ్స్ నిరూపించాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు క్రమశిక్షణతో పెట్టుబడి పెడుతూ కొనసాగడం చాలా అవసరం. అలా లాంగ్ టర్మ్ కొనసాగినట్లయితే హైరిటర్న్స్ అందుకోవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ () తీసుకొచ్చిన ఓ స్కీమ్ నిరూపించింది. అదే (). ఈ స్కీమ్ గడిచిన 3, 5, 20, 20 సంవత్సరాల కాలంలో చూసుకుంటే వార్షిక రాబడి సగటున 16 శాతం చొప్పున అందించింది. జరుగుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఈ స్కీమ్ గురించిన వివరాలు తెలుసుకుందాం. ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్ గడిచిన 20 సంవత్సరాల కాలంలో రాబడి చూసుకుంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా రూ.10 వేలు పొదుపు చేసిన వారికి ఏకంగా రూ.1.54 కోట్లు అందించింది. క్రమశిక్షణతో పెట్టుబడి, సరైన సమయంలో మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వడంతో కలిగే ప్రయోజనాలను ఈ స్కీమ్ సూచిస్తోంది. మరి ఈస్కీమ్‌లో 3 ఏళ్లు, 5 ఏళ్లు, 1 ఏళ్ల రాబడులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 3 ఏళ్ల రిటర్న్స్ సగటున ఏడాదికి 18.56 శాతం సీఏజీఆర్ కలిగి ఉంది.5 ఏళ్ల సిప్ రాబడి సగటున ఏడాదికి 16.04 శాతం సీఏజీఆర్ కలిగి ఉంది. 10 ఏళ్ల సిప్ రిటర్న్స్ సగటున ఏడాదికి 16.09 శాతం సీఏజీఆర్ కలిగి ఉంది. 20 ఏళ్ల సిప్ రాబడులు సగటున ఏడాదికి 16.20 శాతం సీఏజీఆర్ కలిగి ఉంది. ఇక ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్ లాంచ్ తేదీ 2004, అక్టోబర్ 11 నుంచి చూసుకుంటే సగటు రాబడి 16.23 శాతం సీఏజీఆర్ కలిగి ఉంది.నెలకు రూ.10 వేల సిప్‌తో కోట్లుఇక రూ.1 లక్ష లంప్ సమ్ విధానంలో 20 ఏళ్ల క్రితం పెట్టుబడి పెట్టి ఇప్పటి వరకు కొనసాగినట్లయితే ఆ విలువ రూ.16 లక్షలు అవుతుంది. లంప్ సమ్ రాబడి ఏడాదికి సగటున 14.83 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఫోకస్డ్ ఫండ్‌ను 2004, అక్టోబర్ 11వ తేదీన లాంచ్ చేశారు. ఇందులో లంప్ సమ్ ఇన్వెస్ట్‌మెంట్ కనీస పెట్టుబడి రూ.1000గా ఉంది. అదే అయితే నెలకు కనీసం రు.500 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ బీఎస్ఈ 500 టీఆర్ఐ గా ఉంది. ఈ స్కీమ్‌లో వెరీ హై రిస్క్ ఉంటుంది. ఇది ఒక ఓపెన్ ఎండెడ్ స్కీమ్. 2025, నవంబర్ 30 నాటికి ఈ స్కీమ్ వద్ద ఆస్తుల వెలువ రూ.42,773 కోట్లు ఉన్నాయి. ఈ స్కీమ్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.53 శాతంగా ఉంది.