అవన్నీ నిబ్బానిబ్బి పనులు.. కళ్యాణ్ అన్‌ఫాలో కొట్టడంపై శ్రీసత్య కామెంట్స్

Wait 5 sec.

బిగ్‌బాస్ 9 విన్నర్‌ని డిసైడ్ చేసే లాస్ట్ వీక్‌లో చాలానే సర్‌ప్రైజ్‌లు చూశారు ఆడియన్స్. ముఖ్యంగా సీరియల్ నటి అయిన తనూజని తోటి సీరియల్ బ్యాచ్‌యే చాలా మంది వ్యతిరేకించారు. ఆమె సంగతి తమకి తెలుసని.. మా సపోర్ట్ కళ్యాణ్‌కే అంటూ ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. ఆ లిస్ట్‌లో ముందున్నది మాత్రం శ్రీసత్య-యష్మీ. లాస్ట్‌ వీక్ ఓటింగ్ జోరుగా సాగుతున్న సమయంలో శ్రీసత్య-యష్మీ పెట్టిన ఇన్‌స్టా లైవ్ చాలా వైరల్ అయింది. ఆ సమయంలో తనూజ ఫ్యాన్స్‌పై యష్మీ బూతులు కూడా మాట్లాడింది.అయితే ఇంతలా సపోర్ట్ చేసినా.. బయటికి వచ్చిన తర్వాత శ్రీసత్యని ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కొట్టాడు కళ్యాణ్. ఈ విషయంపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది శ్రీసత్య. మిమ్మల్ని కళ్యాణ్ పడాల అన్‌ఫాలో కొట్టినట్లున్నాడు.. రీజన్ ఏంటని యాంకర్ శివ అడిగాడు. "అది వాళ్లకి సంబంధించిన విషయం.. ఈ ఫాలో, అన్‌ఫాలో అనేవి నిబ్బానిబ్బి పనులు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేస్తే ఏంటి, అన్‌ఫాలో చేస్తే ఏంటి.. అయినా తనకి ఏమైందో నాకు తెలీదు.. ప్రతి ఒక్కరికి వాళ్ల వ్యక్తిగత అభిప్రాయం ఉంటుంది.. పర్సనల్ ఇంట్రెస్ట్‌లు ఉంటాయి.. అసలు తను ఎవరో కూడా ముందు నాకు తెలీదు, నేను బయట కూడా చూడలేదు.. నాకు విన్నర్ రేసులో తను డిజర్వింగ్ అనిపించాడు కాబట్టి సపోర్ట్ చేశాం.." అంటూ శ్రీసత్య బదులిచ్చింది.తనూజ పీఆర్‌‌పై ఫైర్అలానే తనూజతో కాంట్రవర్శీ గురించి కూడా శ్రీసత్య ఘాటుగా రియాక్ట్ అయింది. "బిగ్‌బాస్ 9లో నేను ఫస్ట్ నుంచి ఇమ్మానుయేల్‌కి సపోర్ట్ చేశా.. అప్పుడే నన్ను బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు.. సరే లైట్‌లే అనుకున్నా కానీ అవి ఇంకా ఎక్కువైపోయాయి.. అప్పుడే .. అయితే శ్రీజ రీఎంట్రీ ఇవ్వడం నాకు నచ్చింది సో తన వీడియో కింద ఫైర్ సింబల్ కామెంట్ పెట్టా అప్పుడు కూడా నన్ను తిట్టారు.ఇలా ప్రతి దానికి తిట్టడం నాకు నచ్చలేదు.. అంటే ఫ్యామిలీని కూడా తిట్టారు.. పెయిడ్ పీఆర్‌ వాళ్లు డబ్బులు తీసుకున్నదానికి చేస్తే చాలు.. కానీ ఒక లైన్ క్రాస్ చేసి తిట్టారు.. అప్పుడు మేము ఎందుకు ఊరుకుంటాం.. నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి.. ఎన్ని చెత్త కామెంట్లు చేశారో చూపిస్తా కావాలంటే.. పోలీస్ కంప్లెయింట్ కూడా చేశాం.. నేను ఇమ్మూకి సపోర్ట్ చేశా కానీ ఆడియన్స్ తనని విన్నర్ చేసే స్థాయిలో మద్దతు ఇవ్వలేదు.. ఇక నాపైన పెయిడ్ పీఆర్ దాడి ఎక్కువైపోవడంతో అది తట్టుకోలేక కళ్యాణ్‌ని సపోర్ట్ చేశా.. అది కూడా క్లియర్‌గా చెప్పా.." అంటూ శ్రీసత్య ఫైర్ అయింది.