ఉద్యోగులకు ఇన్ఫోసిస్ కీలక ఆదేశాలు.. 4 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. వారికి మాత్రం ఊరట!

Wait 5 sec.

: భారతదేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు వర్క్ పాలసీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. నిర్దిష్ట యూనిట్లలో జాబ్ లెవెల్ 6 ప్లస్ (JL 6A) కింద నియమించిన ఉద్యోగులకు వారంలో కచ్చితంగా 4 రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాలని స్పష్టం చేసింది. కొద్ది రోజుల కిందటి వరకు ఇన్ఫోసిస్‌లో డెలివరీ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్లు వంటి జేఎల్ 7 ఆపైన ఉద్యోగులకే 4 రోజులు ఆఫీసులో పని చేయాలనే నిబంధన ఉండగా.. ఇటీవల హెచ్ఆర్ మెయిల్స్ ప్రకారం.. దీనిని జేఎల్ 6 ప్లస్ వారికి కూడా విస్తరించినట్లు తెలిసింది. దిగువ స్థాయి ఉద్యోగులకు కూడా క్రమంగా వర్క్ ఫ్రం హోం వెసులుబాటును కుదించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం వీరికి ఊరట దక్కింది. >> జేఎల్ 6 దిగువన ఉన్న ఉద్యోగులు లేదా జూనియర్ స్థాయి ఉద్యోగులకు ప్రస్తుతం నెలలో 10 రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాలనే నిబంధన ఉంది. అయితే ఇక్కడ సీనియర్లు కూడా కొందరు కనీసం ఈ నిబంధన కూడా పాటించట్లేదని పేర్కొన్న కంపెనీ.. వారికి వారంలో 4 రోజులు వర్క్ ఫ్రం ఆఫీసును తప్పనిసరి చేసింది. ఆఫీసులకు వచ్చి పని చేసే ఉద్యోగుల సంఖ్యను క్రమంగా పెంచడంలో భాగంగానే ఇన్ఫోసిస్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు అభిప్రాయపడుతున్నారు. భారత అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఒకవైపు ఇప్పటికే వారంలో 5 రోజులు కూడా ఉద్యోగులు ఆఫీసుకు వచ్చి పని చేయాలనే నిబంధన ఎప్పుడో అమలు చేసిన సంగతి తెలిసిందే. మిగతా కంపెనీలు అన్ని రోజులు రావాలని కచ్చితమైన నిబంధన విధించనప్పటికీ.. ఆఫీసుకు వచ్చి పని చేసే వారి సంఖ్యను పెంచాలని మాత్రం చూస్తున్నాయి. ఇందులో భాగంగానే క్రమక్రమంగా ఆఫీసుకు వచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 2026 ఏడాది ప్రారంభంలో ఉద్యోగుల వర్క్ పాలసీకి సంబంధించి విప్రో కూడా కీలక ప్రకటన చేసింది. పేర్కొంది. టీసీఎస్ కచ్చితంగా 5 రోజులు రావాలని చెప్పడమే కాకుండా.. దీనిని ఉద్యోగుల వేరియబుల్ పే తో లింక్ పెట్టింది. ఉద్యోగుల ఆఫీస్ అటెండెన్స్‌ను బట్టి వేరియబుల్ పే చెల్లిస్తామని తెలిపింది.