టెన్నిస్‌ క్రీడాకారుడు సాకేత్‌‌కు ప్రభుత్వ ఉద్యోగం.. డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్, జాయినింగ్

Wait 5 sec.

టెన్నిస్‌ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత మైనేని సాకేత్‌‌ డిప్యూటీ కలెక్టర్ అయ్యారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఆయన్ను డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడలోని కలెక్టరేట్‌లో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌ జి లక్ష్మీశ సాకేత్‌కు డిప్యూటీ కలెక్టర్ జాయినింగ్‌ రిపోర్టు అందించారు. ఎన్టీఆర్ జిల్లాలోనే సాకేత్‌కు డిప్యూటీ కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఏషియన్‌ గేమ్స్‌ సహా ఇంటర్నేషనల్ టోర్నీల్లో పతకాలు సాధించారు. సింగిల్స్‌, డబుల్స్‌, మిక్సిడ్‌ డబుల్స్‌లో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ వేదికలపై ఇనుమడింపజేసిన సాకేత్‌కు ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చింది. సాకేత్ ముందడుగు వేసేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుంది. సాకేత్ రాబోయే రోజుల్లో క్రీడా పోటీల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుని దేశానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురాలి. ఎన్టీఆర్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం సాకేత్‌కు అవసరమైన సహకారాలు అందిస్తుంది. సాకేత్ వచ్చే వారంలో ఏటీపీ ఛాలెంజర్‌ టూర్‌కు సంబంధించి ఐరోపా పర్యటనకు వెళుతున్నారు.. ఆల్ ది బెస్ట్' అంటూ కలెక్టర్ లక్ష్మీశ శుభాకాంక్షలు తెలిపారు. తనకు డిప్యూటీ కలెక్టర్‌గా అవకాశం కల్పించిన ఏపీ ప్రభుత్వానికి మైనేని సాకేత్ ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల కి కూడా ఏపీ ప్రభుత్వం నజరానా ప్రకటించింది. ఉద్యోగం, నగదుతోపాటు.. ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్లు తెలిపారు. ఆమెకు రూ. 2.5 కోట్ల నగదు ఇప్పటికే అందించారు. 500 గజాల ఇంటి స్థలం, శ్రీ చరణి డిగ్రీ పూర్తి చేశాక గ్రూప్-1 ఉద్యోగాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐఎఫ్ఎస్‌ అధికారి రమేష్ కుమార్‌ సుమన్‌ కుమార్తె మిష్కా సుమన్‌కు కారుణ్య నియామకం కింద పోస్టింగ్ ఇచ్చారు. మిష్కాను గ్రూప్‌-1 సర్వీసులోకి తీసుకున్నారు. సీడీఎంఏ కార్యాలయంలో గ్రేడ్‌-3 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులో మిష్కా సుమన్‌ను నియమిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రమేష్ కుమార్‌ సుమన్‌ 1993 కేడర్‌ ఐఎఫ్ఎస్‌ అధికారి కాగా.. ఆయన సర్వీసులో ఉండగానే ప్రాణాల కోల్పోయారు. ఈ క్రమంలో ఆయన కుమార్తెకు మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టును ఇచ్చారు.