తెలంగాణలో కీలక పరిణామం.. 130 మంది మావోయిస్టులు లొంగుబాటు.. సీఎం రేవంత్‌కు ఆయుధాలు సరెండర్

Wait 5 sec.

తెలంగాణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. బంజారాహిల్స్‌లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో మొత్తం 130 మంది మావోయిస్టులు సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. సీఎం రేవంత్‌రెడ్డికి తమ ఆయుధాలను సరెండ్ చేశారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ దళం మొత్తం లొంగిపోయినట్లు తెలిసింది. 31 ఏకే 47 తుపాకులతో పాటుగా 124 ఆయుధాలను సరెండర్ చేశారు. లొంగిపోయినవారిలో ఏవోబీ కీలక నేత చలసాని నవత కూడా ఉన్నారు. మరోవైపు తెలంగాణ స్టేట్ కమిటీ మొత్తం లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ వెల్లడించారు. అంతకుముందు నాలుగు బస్సులలో మావోయిస్టులు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు చేరుకున్నారు.