పశ్చిమాసియాలో యుద్దం కారణంగా తన పొరుగు దేశాలపై జరిపిన దాడులకుచెప్పిన విషయం తెలిసిందే. అయితే, కొద్ది గంటల్లోనే యూటర్న్ తీసుకుని.. పక్క దేశాలకు ఇచ్చింది. ఇరాన్ న్యాయవ్యవస్థ చీఫ్ మాట్లాడుతూ.. ఇరాన్‌కు శత్రువులుగా ఉన్న దేశాలకు.. తమ భూభాగాలను దాడులకు వినియోగించుకోడానికి అవకాశం కల్పిస్తున్న పొరుగు దేశాలపై దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. ‘మన దేశంపై దాడులకు అవసరమైన స్థావరాలను శత్రువులకు అందిస్తున్న ప్రాంతీయ పొరుగు దేశాలను ఇస్లామిక్ రిపబ్లిక్ లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తుంది’ అని ఆయన ఉద్ఘాటించారు.‘‘ఇరాన్ సాయుధ దళాల నుంచి వచ్చిన ఆధారాలు పశ్చిమాసియాలోని కొన్ని దేశాల భౌగోళిక ప్రాంతాలు శత్రువుల వినియోగానికి బహిరంగంగా, రహస్యంగానో అనుకూలంగా ఉన్నాయని చూపుతున్నాయి’’ అని తాత్కాలిక నాయకత్వ మండలి సభ్యుడు అయిన ఘోలామ్‌హోస్సేన్ మొహ్సేని ఎజీ అన్నారు. ‘ఈ లక్ష్యాలపై భారీ దాడులు కొనసాగుతాయి’ అని ఆయన అన్నారు. కాగా, వారిని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్ తోక ముడిచిందని, ఇక అది ఎలాంటి దాడులు చేయలేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు, భారీ దాడులు తప్పవని హెచ్చరించారు. గతవారం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ క్రమంలో పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. అమెరికా మిత్రులైన గల్ఫ్ దేశాల్లో ఈ స్థావరాలు ఉండటంతో ఇరాన్ వాటిని టార్గెట్ చేసింది. దీంతో క్షిపణలు, డ్రోన్‌లతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలపై తాము ఉద్దేశపూర్వకంగా దాడులు చేయలేదని ఇరాన్ శనివారం ప్రకటించింది. డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసే ఆలోచన తమకు లేదని క్షమాపణలు చెప్పింది. అంతేకాదు, మీ భూభాగాల నుంచి మాపై దాడలు చేయకుంటే తాము కూడా ఎలాంటి చర్యలకు పాల్పడమని ఇరాన్ అధ్యక్షుడు అన్నారు. దీనిపై తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కానీ, అంతలోనే మళ్లీ యూటర్న్ తీసుకోవడం గమనార్హం.