పాకిస్థాన్‌లో 20 శాతం పెరిగిన పెట్రోల్ ధరలు.. భారత్‌లోనూ పెరుగుతాయా? కేంద్రం కీలక ప్రకటన

Wait 5 sec.

: అంతర్జాతీయంగా ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌పై తొలుత ఇజ్రాయెల్- అమెరికా సంయుక్త దాడులు నిర్వహించగా.. ఇరాన్ ప్రతిదాడులకు దిగుతోంది. ఇరాన్ తన పొరుగుదేశాలపైనా దాడులు చేస్తోంది. ఈ క్రమంలో చమురు రవాణాకు కీలకంగా ఉన్న హర్ముజ్ జలసంధిని మూసేసింది. నౌకల్ని వెళ్లనీయకుండా అడ్డుకుంటోంది. దీంతో అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. చమురు రవాణాకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. దీంతో భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగొచ్చన్న ఆందోళనలు ఎక్కువయ్యాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూ కట్టిన ఘటనలు సోషల్ మీడియాల్లో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు తాజాగా మార్చి 6న దీనిపై కీలక ప్రకటన చేశాయి. దేశంలో ప్రస్తుతానికి తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని.. పౌరులు ఆందోళన చెందొద్దని ప్రకటన వెలువరించాయి. ఈ ఆందోళనలు మళ్లీ పెరిగేందుకు ప్రధాన కారణం.. మార్చి 7న కేంద్రం వంట గ్యాస్ సిలిండర్ ధరల్ని పెంచడం. కిందటి రోజే . 11 నెలల తర్వాత గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో సిలిండర్ ధర రూ. 905 నుంచి రూ. 965 కు పెరిగింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. వంట గ్యాస్ ధరలు పెరిగిన భయాలకు తోడు.. పొరుగు దేశం పాకిస్థాన్‌లో ఇవే ఉద్రిక్తతల కారణంగా తాజాగా పెట్రోల్, డీజిల్ రేట్లను 20 శాతం వరకు పెంచినట్లు తెలుస్తోంది. లీటరుపై రూ. 55 పెరిగినట్లు తెలిసింది. లీటర్ పెట్రోల్ ధర పాకిస్థాన్ కరెన్సీలో రూ. 321.17 (భారత కరెన్సీలో రూ. 105.67), డీజిల్ ధర రూ. 335.86 కి (మన కరెన్సీలో రూ. 110.51) పెరిగింది. దీంతో మన దగ్గర కూడా పెంచుతారన్న అనుమానాలు పెరిగిపోయాయి. పెట్రోల్ కొరతపై చమురు సంస్థల క్లారిటీ..ఈ నేపథ్యంలోనే పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ మార్చి 6న.. చమురు సంస్థల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారత పౌరులకు సరసమైన ధరల్లో.. స్థిరంగా ఇంధనం అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశంలో ఎలాంటి ఇంధన కొరత లేదని.. వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇదే సమయంలో పూరీ పోస్ట్‌ను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రీపోస్ట్ చేయడంతో పాటు.. అవి కూడా వేర్వేరు ప్రకటనల్లో క్లారిటీ ఇచ్చాయి.'పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాల్లో వస్తున్న పోస్టులు నిరాధారమైనవి. భారతదేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయి. సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌లు సాధారణంగానే పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాను నిర్వహించేందుకు ఇండియన్ ఆయిల్ కట్టుబడి ఉంది. పౌరులు భయపడొద్దు. ఇంధన స్టేషన్లలో రద్దీగా ఉండొద్దు. కచ్చితమైన, వాస్తవ సమాచారం కోసం అధికారిక వనరులపై మాత్రమే ఆధారపడాలి.' అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.రష్యా చమురు కొనుగోలుకు అమెరికా ఓకే..తాజా పరిణామాల నేపథ్యంలో.. . 30 రోజుల పాటు.. ఇప్పటికే సముద్రంలో ఉన్న రష్యా నౌకల నుంచి చమురు కొనుగోలు చేయొచ్చని వెల్లడించింది. ఇది కూడా భారత తాత్కాలిక అవసరాల్ని తీర్చనున్నట్లు తెలుస్తోంది. పెరుగుతున్న ముడిచమురు ధరలు..యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాకు ఆటంకం నేపథ్యంలో.. క్రూడాయిల్ ధర విపరీతంగా పెరుగుతోంది. ప్రతి రోజూ పెరుగుతూనే ఉండగా.. తాజాగా బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 90 డాలర్ల మార్కు దాటింది. వారం వ్యవధిలోనే 20 శాతానికిపైగా ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మార్చి 2న 70 డాలర్ల దిగువన ఉండేది. అయితే ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే.. గల్ఫ్ నుంచి ఎగుమతులు ఆగిపోనున్నాయని.. అప్పుడు బ్యారెల్ చమురు ధర 150 డాలర్లకు చేరొచ్చని ఖతార్ ఇంధన మంత్రి హెచ్చరించారు. అప్పుడు దేశీయంగా కూడా ధరలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా బ్యారెల్ చమురు ధర డాలరు పెరిగినా.. ఏడాదికి మన దేశంపై అదనంగా రూ. 13 వేల కోట్ల భారం పడుతుందని అంచనా.