SGB Gold Bond Scheme: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా () కీలక ప్రకటన చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్ SGB 2020-21 సిరీస్ VI, XII కు సంబంధించి ముందస్తు విమోచన ధరల్ని (ప్రీ మెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్) ప్రకటించింది. వీటి రిడెంప్షన్ తేదీలు వరుసగా మార్చి 7, మార్చి 9 గా ప్రకటించింది. అంటే ఈ తేదీల నుంచి సదరు గోల్డ్ బాండ్లను రిడీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. సాధారణంగా గోల్డ్ బాండ్ల కాల పరిమితి 8 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ ఐదేళ్లు ముగిసిన తర్వాత కూడా ముందస్తుగానే రిడీమ్ చేసుకునేందుకు అవకాశం ఇస్తోంది. ఈ క్రమంలోనే ఐదేళ్లు దాటిన గోల్డ్ బాండ్లపైనా ధరల్ని ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు ఐదేళ్లు పూర్తి చేసుకున్న గోల్డ్ బాండ్ సిరీస్.. ముందస్తు విమోచన ధరల్ని వెల్లడించింది. >> బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న చాలా అవకాశాల్లో ఒకటి. భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించాలన్న ఉద్దేశంతో కేంద్రం గతంలో ఈ స్కీమ్ తీసుకొచ్చింది. ఇక్కడ బంగారాన్ని నేరుగా కొనకుండా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో కేంద్ర ఖజానాపై అదనపు భారం పడటం వల్ల కొత్తగా బాండ్లను జారీ చేయట్లేదు కానీ ఇదే సమయంలో గతంలో ఇష్యూ చేసిన గోల్డ్ బాండ్లపై ధరల్ని మాత్రం ప్రకటిస్తుంది కేంద్రం. ఇప్పుడు గోల్డ్ బాండ్ సిరీస్ 2020-21 సిరీస్ VI ఇష్యూ ప్రైస్ గ్రాముకు లేదా యూనిట్‌కు రూ. 5,117 గా అప్పట్లో ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేసి డిజిటల్ మోడ్‌లో పేమెంట్ చేసిన వారికి గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ లెక్కన గ్రాము ధర వారికి రూ. 5067 కే లభించింది. దీని ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర ఇప్పుడు గ్రాముకు రూ. 16,063 గా ప్రకటించింది. ఇక్కడ గ్రాముపైనే రూ. 16,063- రూ. 5067= రూ. 10,996 లాభం వచ్చింది. ఇది వడ్డీ రేటు కాకుండానే. ఇక్కడ దాదాపు 217 శాతం రిటర్న్స్ వచ్చాయి. వడ్డీ రేటు వార్షికంగా 2.50 శాతంగా ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల కిందట రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి రూ. 3.17 లక్షలు వచ్చాయి. వడ్డీ ఐదేళ్లలో రూ. 12,500 వచ్చింది. దీంతో మొత్తం చేతికి రూ. 3.30 లక్షల వరకు రాబడి వచ్చింది. మరోవైపు 2020-21 సిరీస్ xii గోల్డ్ బాండ్ ఇష్యూ ప్రైస్ గ్రాముకు కేవలం రూ. 4,662 గానే ఉంది. ఇక్కడ డిస్కౌంట్ రూ. 50 తీసేస్తే గ్రాము ధర రూ. 4,612 గానే ఉంది. ఇక్కడ ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధర చూస్తే రూ. 16,063 గానే ఉంది. ఇక్కడ గ్రాముపై రూ. 16,063- రూ. 4,612= రూ. 11,451 గా ఉంది. ఇక్కడ 248 శాతం రిటర్న్స్ వచ్చాయి. లక్షపై రూ. 3.48 లక్షలు వచ్చాయి. ఇక్కడ వడ్డీ కూడా రూ. 12,500 కలిపితే ఐదేళ్లలో లక్ష పెట్టుబడిని రూ. 3.60 లక్షలుగా మలిచింది.