ఒక్క దెబ్బతో గల్ఫ్‌లో అమెరికా కీలక రాడార్ వ్యవస్థ థాడ్‌ను ధ్వంసం చేసిన ఇరాన్

Wait 5 sec.

ఇజ్రాయెల్-అమెరికాలతో తనకున్న పరిమితి వనరులతోనే ధైర్యంగా పోరాటం చేస్తూ.. వ్యూహాత్మకంగా ఎదురుదాడులు చేస్తోంది. ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడి, శత్రువు ఆయుధాలను నాశనం చేస్తోంది. . తాజాగా, గల్ఫ్‌లో క్షిపణి భద్రతను నిర్దేశించే కీలకమైన రాడార్ వ్యవస్థను ఇరాన్ ధ్వంసం చేసిందని, భవిష్యత్ దాడులను ఎదుర్కోవడానికి ఈ ప్రాంతం సామర్థ్యాన్ని ఇది మరింత దెబ్బతీస్తుందని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. యుద్ధం ప్రారంభమైన తొలి రోజుల్లోనే ఇరాన్ దాడుల్లో జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్ వద్ద అమెరికా థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థలు (US THAAD) ఉపయోగించే RTX కార్ప్ AN/TPY-2 రాడార్, సహాయక సామాగ్రి ధ్వంసమైనట్టు శాటిలైట్ ఫోటోలను ఉటంకిస్తూ ముందు సీఎన్ఎన్ నివేదించింది. ఈ వ్యవస్థ ధ్వంసమైనట్టు తాజాగా అమెరికా అధికారి ధ్రువీకరించారు.ఫౌండేషన్ ఫర్ డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్ థింక్ ట్యాంక్ సేకరించిన డేటా ప్రకారం.. జోర్డాన్‌పై ఫిబ్రవరి 28న, మార్చి 3న ఇరాన్ చేసిన రెండు దాడులను అమెరికా అడ్డుకుంది. ‘థాడ్ రాడార్ వ్యవస్థపై దాడి విజయవంతమైతే ఇప్పటివరకు ఇరాన్ చేసిన అత్యంత విజయవంతమైన దాడులలో ఒకటిగా నిలుస్తుంది’ ఫౌండేషన్ ఫర్ ది డిఫెన్స్ ఆఫ్ డెమొక్రసీస్‌ సెంటర్ ఆన్ మిలిటరీ అండ్ పొలిటికల్ పవర్ డిప్యూటీ డైరెక్టర్ ర్యాన్ బ్రోబ్స్ వ్యాఖ్యానించారు. అయితే, ‘అమెరికా సైన్యం, దాని మిత్రపక్షాల వద్ద అధునాతన రాడార్లు ఉన్నాయని, అవి గగనతల, క్షిపణి రక్షణను అందించి, ఏ ఒక్క రాడార్ నష్టాన్ని అయినా తగ్గించగలవు’ అని ఆయన తెలిపారు.సెంటర్ ఫర్ స్ట్రాటజీక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ ప్రకారం.. దక్షిణ కొరియా, గౌమ్ సహా ప్రపంచవ్యాప్తంగా అమెరికాకు 8 థాడ్ వ్యవస్థలు ఉన్నాయి. ఇవి ఒక్కో దాని విలువ 300 మిలియన్ డాలర్లు (అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,760 కోట్లు). ‘ఇవి చాలా విలువైన వ్యూహాత్మక వనరులు.. వీటిని కోల్పోవడం ఒక పెద్ద ఎదురు దెబ్బ’ అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లో క్షిపణి రక్షణ నిపుణుడు టామ్ కరాకో అన్నారు. 2012లో నిర్ణయించిన తొమ్మిది బలగాల నిర్మాణ అవసరాల కంటే ఇప్పటికీ తక్కువగా ఉంది, కాబట్టి TPY-2 రాడార్‌లు సిద్ధంగా ఉండకపోవచ్చని ఆయన అన్నారు.థాడ్ బ్యాటరీలో సాధారణంగా 90 మంది సైనికులు, ట్రక్కులపై అమర్చిన ఆరు లాంఛర్లు, మొత్తం 48 ఇంటర్‌సెప్టర్ క్షిపణులు (ప్రతి లాంచర్‌కు 8 వంతున), ఒక TPY-2 రాడార్‌తో పాటు టాక్టికల్ ఫైర్ కంట్రోల్, కమ్యూనికేషన్ యూనిట్ ఉంటాయి. ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 13 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గగనతల, రక్షణ వ్యవస్థ ఏర్పాటుచేయాలంటే ఇదొక్కటే మార్గమని పసిఫిక్ ఫోరమ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుడు విలియమ్ అల్బెర్క్యూ అన్నారు.