జేకబ్ బెతెల్.. ఈ పేరు చాన్నాళ్లూ యాదుంటది! సెంచరీతో వరల్డ్ క్రికెట్‌లో అరుదైన ఘనత

Wait 5 sec.

లో లో ఇంగ్లండ్ ఓడిపోయినా, యువ బ్యాటర్ అద్భుత ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్‌లో అరుదైన రికార్డు సృష్టించాడు. ముంబైలోని వాంఖడే‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో నిలబడగా, బెతెల్ తన దూకుడైన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను చివరి వరకు ఆసక్తికరంగా మార్చాడు.ఈ సెంచరీ బెతెల్‌కు టీ20 క్రికెట్‌లో తొలి శతకం. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనతను కూడా అతను సాధించాడు. తన కెరీర్‌లో తొలి ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఏ, టీ20 సెంచరీలను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లోనే సాధించిన తొలి ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ అరంగేట్రానికి ముందు అతని పేరుమీద ఒక్క సెంచరీ కూడా లేకపోయినా, తక్కువ కాలంలో మూడు ఫార్మాట్లలో మూడు శతకాలు నమోదు చేయడం విశేషం.అదే సమయంలో నాకౌట్ మ్యాచ్‌ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును కూడా బెతెల్ బద్దలు కొట్టాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఫిన్ అలెన్ పేరిట ఉండేది. అతను దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్‌లో 100 నాటౌట్‌గా నిలిచి ఈ రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ రికార్డు ఎక్కువ రోజులు నిలవలేదు. బెతెల్ 105 పరుగులతో కొత్త రికార్డు నమోదు చేశాడు.టీ20 వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు ఇలా ఉన్నాయి: జేకబ్ బెతెల్ – 105 (భారత్‌పై, 2026 సెమీఫైనల్), ఫిన్ అలెన్ – 100 నాటౌట్ (దక్షిణాఫ్రికాపై, 2026 సెమీఫైనల్), తిలకరత్న దిల్షాన్ - 96 నాటౌట్ (వెస్టిండీస్‌పై, 2009 సెమీఫైనల్). విరాట్ కోహ్లి – 89 నాటౌట్ (వెస్టిండీస్‌పై, 2016 సెమీఫైనల్), సంజు శాంసన్ – 89 (ఇంగ్లండ్‌పై, 2026 సెమీఫైనల్).ఈ సెమీఫైనల్ మ్యాచ్‌లో మరో ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. మొత్తం మ్యాచ్‌లో రెండు జట్లు కలిపి 499 పరుగులు చేయడం టీ20 చరిత్రలో రెండో అత్యధిక స్కోరు. అలాగే మ్యాచ్‌లో మొత్తం 34 సిక్సర్లు పడటం టీ20 వరల్డ్‌కప్ చరిత్రలోనే అత్యధికం. 39 ఫోర్లు సహా మొత్తం 73 బౌండరీలు నమోదవడం కూడా వరల్డ్‌కప్ మ్యాచ్‌లలో రికార్డు స్థాయి గణాంకంగా నిలిచింది.ఈ విజయంతో భారత్ వరుసగా రెండోసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇలా వరుసగా రెండు ఫైనల్స్ ఆడిన మూడో జట్టుగా భారత్ నిలిచింది. ఇంతకు ముందు పాకిస్తాన్, శ్రీలంక జట్లు మాత్రమే ఈ ఘనత సాధించాయి. భారత్ - న్యూజిలాండ్ మధ్య టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మార్చి 8న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.