HYD: రైల్వేస్టేషన్‌ నుంచి మెట్రో స్టేషన్‌కు స్కై వాక్‌.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన

Wait 5 sec.

రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం 'అమృత్ భారత్ స్టేషన్ పథకం' ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద తెలంగాణలోని రైల్వే స్టేషన్లు సరికొత్త రూపురేఖలను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40కి పైగా రైల్వే స్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేసి.. వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రధానంగా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లతో పాటు నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లోని స్టేషన్లను కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నారు.ఈ పథకంలో భాగంగా.. నాంపల్లి రైల్వే స్టేషన్‌ను 2027 చివరికల్లా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌ తరహాలో ఆధునిక హంగుల్నీ కల్పిస్తామని తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌ అభివృద్ధి పనులపై అధికారులతో గురువారం (మార్చి 5) ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలి దశలో రూ.327 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. దశల వారీగా స్టేషన్‌ రూపు రేఖలే మారుస్తామని తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కాగా, రైల్వే స్టేషన్లను విమానాశ్రయాల తరహాలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించనున్నారు. స్టేషన్ల ముఖద్వారాలను స్థానిక సంస్కృతి, కళలను ప్రతిబింబించేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. స్టేషన్ ఆవరణలో విశాలమైన వెయిటింగ్ హాళ్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్‌లు, ఆధునిక ఫర్నిచర్, ఉచిత వై-ఫై వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. పాదచారుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్టేషన్ చేరుకునేందుకు లిఫ్టులు, ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపులు, టాయిలెట్లు నిర్మిస్తూ స్టేషన్లను అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందిస్తున్నారు.మౌలిక సదుపాయాలే కాకుండా, ట్రాఫిక్ నిర్వహణపై కూడా రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. స్టేషన్ వెలుపల వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాలను కేటాయించారు. బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు వీలుగా సిటీ సెంటర్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. వన్ స్టేషన్-వన్ ప్రొడక్ట్ కింద స్థానిక ఉత్పత్తుల విక్రయాలకు ప్రత్యేక స్టాళ్లను కూడా ఏర్పాటు చేసి స్థానికులకు ఉపాధి కల్పిస్తున్నారు. పర్యావరణ హితంగా ఉండేలా స్టేషన్ ఆవరణలో సోలార్ ప్యానెల్స్, గ్రీన్ బెల్ట్స్, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలను కూడా అమలు చేస్తున్నారు. ఈ పనులన్నీ పూర్తయితే తెలంగాణలో రైలు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా మారనుంది.